Ads
ఏ కూతురుకైనా తండ్రే హీరో.. ఏ తండ్రికి అయినా కూతురే మహారాణి. తండ్రి కూతుర్ల బంధాన్ని వర్ణించడం ఎవరితరం కాదు. తన కూతురు కోసం ఎన్ని కష్టాలైనా పడే తండ్రి.. అలాగే, తండ్రి కోసం కూతుర్లు కూడా ఎంత దూరం వెళ్లడానికైనా ఇష్టపడతారు. ఇప్పుడు మీరు చదివేది యూరప్ లో నిజం గా జరిగిన ఓ సంఘటన..
Video Advertisement
యూరప్ లో సిమోన్ అనే ఓ వ్యక్తి ని ఓ నేరం కింద అరెస్ట్ చేసి జైలు లో ఉంచేవారు. అతను ఆకలితో చచ్చిపోయే వరకు జైలులోనే ఉంచాలని అతనికి శిక్ష విధించారు. అతనికి ఎటువంటి ఆహరం ఇచ్చేవారు కాదు. ఆయనకు ఓ కూతురు ఉండేది. ఆమె పేరు పెరూ. ఆమె అక్కడి జైలర్ ను బతిమిలాడి రోజుకు ఒకసారి తన తండ్రిని చూడడానికి అనుమతిని పొందింది. అయితే.. ఒక కండిషన్ మీదే ఆ జైలర్ తండ్రిని చూడడానికి అనుమతించాడు. అదేంటంటే.. ఆమె తండ్రి కోసం తినడానికి ఎలాంటి ఆహార పదార్ధాలను తీసుకురాకూడదు.
ఆమె అందుకు అంగీకరించింది. ఉత్త చేతులతో రోజు వచ్చి తన తండ్రిని చూసి వెళ్తూ ఉండేది. అయితే.. ఆహారం పెట్టకపోయినా.. ఎన్ని రోజులైనా అతను చావకపోవడం తో అనుమానం వచ్చిన అధికారులు ఆమె ఏమి చేస్తోందో చూసి ఆశ్చర్యపోయారు. ఆమె ప్రతిరోజు వచ్చి తన స్తన్యం నుంచి తండ్రికి పాలు ఇవ్వసాగింది. ఆ తండ్రి పాలు తాగి బతికేవాడు.
ఇదేమి పని ఆ జైలు అధికారులు ఆమె ను ప్రశ్నించగా.. నా తండ్రి నాకు చేసిన దానితో పోలిస్తే.. నేను అందిస్తున్నది చాలా తక్కువ. ఇంతకంటే ఏమి చేసి నా తండ్రి ఋణం తీర్చుకోగలను అని ప్రశ్నించింది. ఈ విషయం న్యాయస్థానం వరకు వెళ్ళింది. మానవతా దృక్పధం తో న్యాయస్థానం సిమోన్ పై ఉన్న శిక్షను రద్దు చేసి ఇంటికి పంపేశారు.
End of Article