Ads
మనకు జీవితం లో ముఖ్యమైన వ్యక్తి ఎవరు అని అనగానే.. మన మైండ్ లో చాలా మంది మెదలుతారు. కానీ, చివరకు మనకు గుర్తుకు వచ్చేది మన జీవిత భాగస్వామి మాత్రమే.. ఈ విషయాన్నీ అర్ధం అయ్యేలా చెప్పడానికే ఓ సైకాలజీ లెక్చరర్ తన పాఠాన్ని డిఫరెంట్ గా ప్లాన్ చేసింది. అది ఎలానో ఇప్పుడు చూద్దాం.
Video Advertisement
ఆరోజు క్లాస్ లో సైకాలజీ లెక్చరర్ ఓ ఆట ఆడుకుందాం అని చెప్పి క్లాస్ లో ఉన్న వారిలో ఒక అమ్మాయిని లేపారు. ఆ అమ్మాయికి పెళ్లి అయ్యి ఒక బాబు కూడా ఉన్నాడు. అయితే.. ఆమెను బోర్డు దగ్గరకు పిలిచి.. నీ జీవితం లో నీకు చాలా ముఖ్యమైన ఒక 30 మంది పేర్లు రాయాలి అంటూ ఆమెకు చెప్పారు. ఆమె తన కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల పేర్లు కలిపి 30 మంది పేర్లను రాసింది. ఆ తరువాత వాటిలో నుంచి నువ్వు అంతగా ప్రాధాన్యత ఇవ్వని ఒక మూడు పేర్లు చెరిపేయాలని కోరగా.. తనకు ఇష్టమైన ముగ్గురి స్నేహితుల పేర్లను తుడిచేసింది.
ఆ తరువాత మరొక ఐదుగురి పేర్లను కూడా చెరిపేయాలని కోరగా.. మరో ఐదుగురు బంధువుల పేర్లను కూడా చెరిపేసింది. ఇలా చెరిపేస్తూ పోగా.. చివరకు ఆమె భర్త, అమ్మ, నాన్న, కొడుకు ల పేర్లు మిగిలాయి. వాటిలో మరో రెండు పేర్లు చెరిపేయమనగా.. ఆమెకు ఏడుపు రాసాగింది. ఆమె ఏడుస్తూ.. ఆమె తల్లితండ్రుల పేర్లను చెరిపేసింది. ఇక మిగిలింది భర్త, కొడుకు. వారిలో కూడా ఒక పేరుని చెరిపేయాలని ఆ లెక్చరర్ కోరారు.
ఆమె ఇక కన్నీరు ఆపుకోలేకపోయింది. ఎంతగానో ఏడుస్తూ.. కొడుకు పేరు ను కూడా చెరిపేసి వచ్చి తన ప్లేస్ లో కూర్చుంది. క్లాస్ మొత్తం నిశ్శబ్దం అలుముకుంది. కొంతసేపు అయ్యాక.. ఆ లెక్చరర్ ఆమెను ఇలా అడిగారు.. నీకు జన్మనిచ్చిన తల్లి తండ్రులు, నువ్వు కన్న కొడుకుని కూడా చెరిపేసి.. నీ భర్త పేరుని మాత్రమే ఎందుకు ఉంచావు అని అడిగారు. దానికి ఆమె ఏమని సమాధానం చెప్పిందో తెలుసా..?
నా తల్లితండ్రులు నాకంటే ముందు ఈ లోకాన్ని, నన్ను వదిలేసి వెళ్లారు. చదువు, లేదా ఉద్యోగం కోసం నా కొడుకు కూడా నన్ను వదిలేసి వెళ్తాడు. కానీ.. చివరిదాకా నా తోడు ఉండేది నా భర్త మాత్రమే అంటూ వెక్కి వెక్కి ఏడుస్తూ చెప్పింది. అది ఆట కాదని క్లాస్ లో అందరికి అర్ధమైంది. అందరు ఒక్కసారి గా లేచి చప్పట్లు కొట్టారు.
NOTE: images used in this article are just for representative purpose. But not the actual characters.
End of Article