Ads
పెళ్లి, సంతానం కలగడం, వారికి పేర్లు పెట్టడం, ఆలనా పాలనా చూడడం ఇవన్నీ అత్యంత మధురమైన ఘట్టాలు. మనకు తెలిసిన వారికి ఎవరైనా పిల్లలు పుడితే.. వారికి ఏమి పేరు పెడతారో అనో.. లేక వారేదైనా సలహా అడిగితె ఏమి పేర్లు చెప్పాలో అని తెగ ఆలోచించేస్తూ ఉంటాం.. అదే సెలెబ్రెటీలకు పిల్లలు పుడితే.. వారికి ఏమి పేర్లు పెడతారో అని సహజం గానే అందరికి ఆసక్తి కలుగుతుంది.
Video Advertisement
పేర్లు పెట్టడం అనేది చిన్న విషయం లానే కనిపించినా.. నిజానికి అదో ప్రహసనమే. ఒకప్పుడు అంటే పేర్లు పెట్టడానికి తమ శ్రేయోభిలాషులో.. తాము నమ్మిన భగవంతుడి పేరో, తమ తల్లితండ్రులు, నాన్నమ్మ,తాతయ్య ల పేర్లు కలిసొచ్చేలా ఒక మినీ భారతం టైపు లో పేర్లు ఉండేవి. ఆ తరువాత రెండు మూడు వర్డ్స్ తో పేర్లు పెట్టె ట్రెండ్ వచ్చింది. ఈ ట్రెండ్ కూడా అయిపోయాక సింగల్ వర్డ్ తో పేర్లు పెట్టె ట్రెండ్ కొన్నాళ్ల పాటు నడిచింది.
ప్రస్తుతం ట్రెండ్ మారింది. పేరు వినడానికి ట్రెండీ గా ఆకట్టుకునేలా..అర్ధవంతం గా ఉండేలా చూసుకుంటున్నారు. చాలా మంది సెలబ్రిటీ పేరెంట్స్ తమ పిల్లలకు తమ ఇద్దరి పేర్లు కలిసి వచ్చేలా పేర్లను కంబైన్ చేస్తూ సింగల్ నేమ్ ను క్రియేట్ చేస్తున్నారు.
ఉదాహరణకి.. రీసెంట్ గా విరుష్క (అనుష్క, విరాట్ కోహ్లీ) జంట పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ తమ బిడ్డకి తమ ఇద్దరి పేర్లలో అక్షరాలు కలిసొచ్చేలా వామిక అని పేరు పెట్టారు. ఇలా పిల్లలకు పేర్లు పెట్టిన 9 సెలెబ్రిటీల లిస్ట్ ఓ లుక్ వేయండి..
# పవన్ కళ్యాణ్ :
పవన్ చిన్న కొడుకు పేరు :
మార్క్ శంకర్ పవనోవిచ్ (మార్క్ అనగా క్రిష్టియన్ దృష్టి లో మార్స్ దైవం, శంకర్ అనగా మెగాస్టార్ అసలు పేరులోంచి తీసుకున్న పేరు, పవన్ కళ్యాణ్ లోని పవన్ ను కూడా యాడ్ చేసి ఈ పేరు పెట్టారు.
పవన్ రెండో కూతురి పేరు: పోలిన అంజనా పవనోవనా- ఈ పేరులో పోలిన అంటే గ్రీకు దైవం. అంజనా పవన్ కళ్యాణ్ గారి తల్లి పేరు.
#రానా
రానా పేరు కూడా ఆయన తాతగారు పేరు రామానాయుడు నుంచి రెండు అక్షరాలను కలిపి రానా అని పెట్టారు.
#అర్హ
అల్లు అర్జున్, స్నేహ రెడ్డి ల కుమార్తె అర్హ పేరు కూడా అల్లు అర్జున్, స్నేహ ల పేర్లు కలిసి వచ్చేలా పెట్టుకున్నారు.
#నాగ చైతన్య
అక్కినేని వారి ఫామిలీ లో కూడా నాగేశ్వర్రావు, నాగార్జున, నాగ చైతన్య.. ఇలా నాగ అన్న పేరు కామన్ గా ఉంటూ వస్తుంది.
#మిషా
బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ పేరు ఇది. షాహిద్ భార్య మీరా పేరు లోని మీ, షాహిద్ పేరు లోని షా కలుపుకుని ఆమె మిషా అని పేరు పెట్టారు.
# ఆరాధ్య
ఆరాధ్య ఎంత ఫేమస్ అన్నది చెప్పక్కర్లేదు. మిస్ వరల్డ్ ఐశ్వర్యా రాయ్ కూతురు గా, బాలీవుడ్ బాద్ షా అమితాబ్ మనవరాలి గా ఆమె అందరికి సుపరిచితమే. ఆమె పేరు కూడా అభిషేక్, ఐశ్వర్య ల పేర్లలో అక్షరాలు కలిసేలా ఆరాధ్య అని పెట్టారు.
#వివాన్
బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్, తన వైఫ్ నేమ్ ప్రియాంక లో అక్షరాలు కూడా కలిసి వచ్చేలా వివాన్ అని పేరు పెట్టారు.
#హ్రిహాన్,హ్రిదాన్
వీరిద్దరూ హృతిక్ రోషన్ పిల్లలు. హృతిక్ రోషన్ తన పిల్లల ఇద్దరి పేర్లలోనూ తన పేరులో మొదటి చివరి అక్షరాలు వచ్చేలా పేర్లు పెట్టారు.
#ఆదిరా:
రాణి ముఖర్జీ, తన భర్త ఆదిత్య ల ఇద్దరి పేర్లలోనూ అక్షరాలను కలిపి “ఆదిరా” అని పేరు పెట్టారు.
End of Article