Ads
ప్రముఖ జర్నలిస్ట్, దర్శకుడు, రచయిత టిఎన్నార్ గారు హఠాన్మరణం చెందిన సంగతి తెలిసిందే. కరోనా కారణం గానే ఆయన మృత్యువాత పడ్డారు. ఆయన కరోనా సోకినా తరువాత కూడా తాను బాగానే ఉన్నానని చెప్పారు.. కానీ.. హఠాత్తుగా ఆయన మరణించడం తో ఆయన అభిమానులు తీరని శోకం లో మునిగిపోయారు. అయితే.. ఆయన హఠాన్మరణం వెనుక కరోనా ఏ స్థితి లో తీవ్ర రూపం దాల్చిందో డా సి ఎల్ వెంకట్ రావు గారు వివరించే ప్రయత్నం చేసారు.
Video Advertisement
కరోనా ఫస్ట్ వేవ్ లో మధ్యవయసు, యువత కు అంత గా ఇబ్బందులు ఎదురుకాలేదు.. దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్నవారు, ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవారు ఎక్కువ గా ఇబ్బందిపడి ప్రాణాలు కోల్పోయారు. అయితే.. సెకండ్ వేవ్ కి వచ్చేసరికి.. ఈ ప్రభావం ఎక్కువ గా యువత, మధ్యవయస్కుల పైనా కనిపిస్తోంది అని వెంకట్ రావు గారు అభిప్రాయపడ్డారు. చాలా మందిలో కరోనా సోకినా కూడా ఎలాంటి లక్షణాలు కనిపించడం లేదు. కానీ ఆక్సిజెన్ లెవెల్స్ 70 నుంచి 80 కి పడిపోతున్నాయి. కానీ.. ఆక్సిజెన్ తగ్గినట్లు ఏమి అనిపించదు.. ఆయాసం కూడా ఉండదు. ఎలాంటి సంకేతాలు ఉండడం లేదు..
ఇలాంటప్పుడు కరోనా సోకింది అని మనం అనుమానించలేం. కానీ అంతా బాగానే ఉంది అని అనుకునేవారు కూడా పల్స్ ఆక్సిమీటర్ తో చెక్ చేసుకోవాలి. ముందు తెలియకపోయినా.. కరోనా ఒక్కసారిగా దాడి చేయవచ్చు. టిఎన్నార్ గారి విషయం లో కూడా ఇదే జరిగి ఉండవచ్చని డా సీఎల్ వెంకట్ రావు గారు అభిప్రాయపడ్డారు.కరోనా తీవ్రత నిర్ధారణ కోసం ఐదు పరీక్షలు అందుబాటులో ఉన్నాయి.
సీబీపీ, సీఆర్పీ, ఎల్డిహెచ్ వంటి టెస్ట్ లు వ్యాధి తీవ్రతను అంచనా వేయడానికి దోహదం చేస్తాయి. ఊపిరితిత్తులు, మెదడు, వంటి భాగాలలో ఎక్కడైనా రక్తం గడ్డలు కట్టేసి ఉంటె గుర్తించడానికి ఈ పరీక్షలు అవసరం అని డా సీఎల్ వెంకట్ రావు గారు అభిప్రాయపడ్డారు. వీటిని ముందు గా గుర్తించి జాగ్రత్తలు తీసుకుంటే పరిస్థితి ని అదుపు చేయవచ్చు.
End of Article