Ads
గత కొన్ని నెలల నుండి ప్రతి ఒక్కరు ఆరోగ్యం మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. మామూలుగానే ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించేవారు ఇప్పుడు ఇంకా ఎక్కువగా జాగ్రత్త వహిస్తున్నారు. కారణం ఏంటో అందరికీ తెలుసు. కరోనా వైరస్ వ్యాప్తి కూడా ఎక్కువగా జరుగుతోంది కాబట్టి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించారు. దాంతో చాలా మంది ఇది ఇప్పటి వరకు ఇలా పనులన్నీ ఆపుకుని ఇంట్లో ఉండటం అనేది ఎప్పుడూ జరగలేదు అని అనుకుంటాం.
Video Advertisement
కానీ వంద సంవత్సరాల క్రితం కూడా ఇలాంటి పరిస్థితి వచ్చింది. దానిని స్పానిష్ ఫ్లూ అని పిలిచారు.ఇది 1918 లో మొదటి వరల్డ్ వార్ ముగిసిన తర్వాత మొదలయ్యింది. ఈ వైరస్ 50 మిలియన్ మందికి సోకగా 15 మిలియన్ల మరణాలు భారత దేశంలో నమోదయ్యాయి. ప్రపంచంలో ఉన్న ప్రతి చోటికి ఈ వైరస్ వ్యాపించింది. పాండమిక్ వల్ల ఎక్కువ ఇంపాక్ట్ అయిందన్న రిపోర్ట్ మాత్రం స్పెయిన్ నుండి వచ్చింది.
మిగిలిన దేశాల వాళ్లు ఈ వైరస్ కి సంబంధించిన వార్తలను దాచారు. అందుకే దీనికి స్పానిష్ ఫ్లూ అనే పేరు వచ్చింది. రిపోర్ట్ ప్రకారం యుద్ధం నుండి వచ్చిన సైనికులకు ఈ వైరస్ సోకింది. వారు వారి స్వస్థలానికి చేరుకున్నప్పుడు ఈ వైరస్ మిగిలిన వారికి వ్యాపించింది. ఈ వైరస్ 20 నుండి 40 సంవత్సరాల వయసులో ఉన్న వారిపై ప్రభావం చూపింది.
ఈ వైరస్ సోకిన వారి రెస్పిరేటరీ సిస్టమ్ పై ప్రభావం చూపింది. తర్వాత రోగనిరోధక శక్తిపై తర్వాత ఊపిరితిత్తుల పై కూడా ప్రభావం చూపింది. భారతదేశంలో మొదటి స్పానిష్ ఫ్లూ కేసు జూన్ 1918లో ముంబైలో నమోదయింది. ఏడుగురు పోలీసులు ఈ ఫ్లూతో హాస్పిటల్ లో చేరారు. మొదటి వేవ్ లో ఈ వైరస్ 1600 మందికి సోకింది.
అప్పుడు ఇది కేవలం ముంబై కి మాత్రమే పరిమితం అయ్యింది. రెండవ వేవ్ 1918 లో సెప్టెంబర్ లో వచ్చింది. అప్పుడు దేశమంతటా 15 నుండి 20 మిలియన్ల మందికి ఈ వైరస్ సోకింది. గంగానదిలో మృతదేహాలు తేలాయి అని నివేదిక వచ్చింది. స్పానిష్ ఫ్లూ మార్చ్ 1920 లో ఆగింది.
అప్పుడు కూడా ఇలాగే ఎంతో మంది అనారోగ్య సమస్యలకు గురయ్యారు. ఆ వైరస్ కూడా ఇలాగే వ్యాప్తి చెందింది. ఆ వైరస్ కి వైద్యం లేదు. విరుగుడు లేదు. సరైన మెడిసిన్ కూడా లేదు. దాంతో స్పానిష్ ఫ్లూ వల్ల ప్రజలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఇంటి నుంచి బయటకు రావాలంటే కూడా చాలా భయపడ్డారు.
దాంతో అప్పుడు అందరూ వారి ఇళ్లలోనే ఉన్నారు. ఎక్కడ నుంచి ఈ వైరస్ వస్తుందో తెలియదు కాబట్టి దుకాణాలను కూడా మూసివేశారు. అంతే కాకుండా అప్పుడు కూడా మాస్కులు ధరించడం అనేది తప్పనిసరిగా పాటించేవారు. ఇదంతా చదువుతూ ఉంటే ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న పరిస్థితే గుర్తొస్తుంది కదా. అవును. వంద సంవత్సరాల క్రితం కూడా ఇలాంటి పరిస్థితి ఎదురయ్యింది.
watch video:
End of Article