Ads
సినిమా ఇండస్ట్రీ లో హీరోయిన్స్ అంటే.. పెళ్లి ఉసెత్తరు. కెరీర్ ఊపు లో ఉన్న సమయం లో పెళ్లి సంగతి ని పక్కన పెట్టేస్తూ ఉంటారు. కాస్త ఆలస్యం గా పెళ్లి చేసుకుంటారు. అయితే.. కరోనా నేపధ్యం లో సినిమా షూటింగ్ లు నిలిచిపోతున్నాయి. ఈ క్రమం లో కెరీర్ కు బ్రేక్ రావడం తో కొందరు ముద్దు గుమ్మలు పెళ్లి పీటలు ఎక్కడానికి సిద్ధం అయిపోతున్నారు. ఇటీవలే.. కాజల్ అగర్వాల్ కూడా పెళ్లి చేసేసుకున్న సంగతి తెలిసిందే. కొత్తగా పెళ్లి చేసుకోబోతున్న వారెవరో ఇప్పుడు చూద్దాం..
Video Advertisement
మెహరీన్ కౌర్:మెహరీన్ కౌర్ కృష్ణ గాడి వీర ప్రేమ గాథ సినిమా తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఆ తరువాత ఆమె నటించిన రాజా ది గ్రేట్, ఎఫ్ 2 సినిమాలు కూడా ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. పంజాబ్ కు చెందిన పొలిటికల్ లీడర్ తనయుడు భవ్య బిష్ణోయ్ తో మెహరీన్ నిశ్చితార్ధం గత మార్చి లోనే జరిగింది. అయితే.. కరోనా సెకండ్ వేవ్ కారణం గా వీరి పెళ్ళికి బ్రేక్ పడింది. తొందరలోనే వీరిద్దరూ పెళ్లి పీటలు ఎక్కనున్నారు.
అవికాగోర్:
చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ ద్వారా తెలుగు వారికి బాగా దగ్గరైన అవికాగోర్ కూడా పెళ్లి కూతురు కాబోతోంది. తెలుగు సినిమాల ద్వారా కూడా ఆమె మంచి కీర్తి సంపాదించేసుకుంది. ప్రస్తుతం ఆమె అడ్వెంచర్ షో ఎంటివి రోడీస్ లో పార్టిసిపేట్ చేస్తున్న మిలింద్ చద్వాని తో ప్రేమలో ఉంది. వచ్చే ఏడాది లో ఈ జంట కూడా పెళ్లి పీటలెక్కనున్నారని తెలుస్తోంది.
శృతి హాసన్:
శృతి హాసన్ కూడా ఓ వ్యక్తి తో ప్రేమలో పడ్డారు. ఆర్టిస్ట్ శంతను హజారికా, శృతి హాసన్ ప్రేమలో పడ్డారట. వీరిద్దరూ ప్రస్తుతం లివ్ ఇన్ లో ఉన్నారు. ఫామిలీ మెంబర్స్ సమక్షం లో ఈ ఏడాది వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నట్లు తెలుస్తోంది.
నయనతార:
నయనతార పెళ్లి గురించి ఇప్పటి వరకు చాలా పుకార్లే వచ్చినప్పటికి.. ఈ సారి మాత్రం నయన్ సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. నయనతార, విగ్నేష్ శివన్ గత కొంతకాలం గా ప్రేమలో ఉన్నారు. కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతం తగ్గిన తరువాత.. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షం లో సెప్టెంబర్ లో వీరిద్దరూ పెళ్లి చేసుకోనున్నట్లు తెలుస్తోంది.
End of Article