Ads
కరోనా కారణం గా థియేటర్లను మళ్ళీ మూసివేయాల్సి వచ్చింది. దీనితో.. సినిమా విడుదలలను నిలిపివేశారు. పలు చోట్ల షూటింగ్ లు కూడా వాయిదా పడుతున్నాయి. గతేడాది కూడా ఇదే పరిస్థితిలో పలు సినిమాలు ఓటిటి లో విడుదల అయిపోయాయి. గతేడాది నాని నటించిన “వి” సినిమా ఓటిటి లో విడుదల అయిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది కూడా నాని సినిమా ఓటిటి లోనే విడుదల అవుతుందంటూ వార్తలు వస్తున్నాయి.
Video Advertisement
నాని నటించిన “టక్ జగదీశ్” సినిమా ఈ ఏడాదే విడుదల కావాల్సి ఉంది. అయితే కరోనా నేపధ్యం లో ఈ సినిమా థియేటర్ రిలీజ్ పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమం లో ఈ చిత్ర యూనిట్ ట్విట్టర్ మాధ్యమం ద్వారా క్లారిటీ ఇచ్చింది. “నాని మూవీ “టక్ జగదీశ్” థియేటర్లోనే విడుదల అవుతుందని.. ఎలాంటి పుకార్లు నమ్మ వద్దని మూవీ యూనిట్ స్పష్టం చేసింది. అంటే.. “టక్ జగదీశ్” సినిమా చూడాలంటే మరి కొంత కాలం వేచి ఉండాల్సిందే అన్నమాట..
Natural Star ? @NameisNani ‘s #TuckJagadish will release in THEATERS only!!
Don’t believe any rumours.— BARaju’s Team (@baraju_SuperHit) May 27, 2021
End of Article