Ads
నగ్మా, జ్యోతిక, రోషిణి.. వీరు ముగ్గురు అక్క చెల్లెళ్ళు.. ముగ్గురు ఒకరికి ఒకరు బాగా సపోర్టివ్ గా ఉంటారు. అలానే.. నగ్మా, జ్యోతిక కూడా సినిమా ఇండస్ట్రీ లో చెరిగిపోని ముద్ర వేశారు.. వివాహం ముందు వరకు టాప్ హీరోలతో జత కట్టి తెలుగు ప్రేక్షకుల్ని అలరించిన నగ్మా పెళ్లి అయిన తరువాత సినిమాలకు దూరం గా ఉన్నారు. ఆ తరువాత ఆమె రాజకీయాల్లోకి కూడా వెళ్లారు.
Video Advertisement
మరో వైపు జ్యోతిక.. హీరో సూర్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. పెళ్లి అయిన తరువాత కూడా వీరిద్దరూ విభిన్న కధాంశాలలో సినిమాలలో నటిస్తూ అలరిస్తున్నారు. పెళ్లి అయిన తరువాత కూడా జ్యోతిక “36 వయసులో” వంటి సినిమా తో హిట్ కొట్టారు. ఈ సినిమా తమిళనాట మంచి విజయమే రికార్డు చేసింది.
ఈ ముగ్గురు సిస్టర్స్ ఫంక్షన్స్ లో కూడా కలుస్తూ.. ఫోటోలు దిగుతూ సందడి చేస్తారు. ఒకరికొకరు సపోర్టివ్ గా ఉంటారు. అయితే.. జ్యోతిక, రోషిణిలకు నగ్మా హాఫ్ సిస్టర్ అన్న సంగతి చాలా మందికి తెలియదు. వీరు ముగ్గురికి తల్లి ఒకరే అయినా.. తండ్రి వేరు. నగ్మా తల్లి సీమా సదనా మహారాష్ట్ర లోని స్వతంత్ర సమరయోధుల కుటుంబం లో షామా ఖాజి గా జన్మించారు. ఆమె అరవింద్ మొరార్జీ అనే టెక్స్టైల్ ఇండస్ట్రియలిస్ట్ ను వివాహం చేసుకున్నారు. వారికి నగ్మా జన్మించారు.
ఆ తరువాత, వారిద్దరూ విడిపోయి డివోర్స్ తీసుకున్నారు. డివోర్స్ తరువాత సీమా ఫిలిం ప్రొడ్యూసర్ చందెర్ సదనా ను వివాహం చేసుకున్నారు. వీరికి జ్యోతిక, రోషిణి లు జన్మించారు. అయితే.. తన అసలు తండ్రి ఎవరో నగ్మా నే ఒక ఓల్డ్ ఇంటర్వ్యూలో తెలిపారు. 2006 వరకు(ఆయన ఈ లోకం లో ఉన్నంతవరకు) ఆమె తన తండ్రితో క్లోజ్ గానే ఉండేదట. అలానే తన తల్లిని, సిస్టర్స్ ని, స్టెప్ ఫాదర్ ని ఎంతగానో ఇష్టపడేది. ఇప్పటికీ ఫంక్షన్స్ లో వీరు కలిసే సెలెబ్రేట్ చేసుకుంటారు.
End of Article