ఐఐటీలో చదువుకుని దేశం గర్వించదగ్గ స్థాయిలో ఉన్న 15 మంది ప్రముఖులు.! ఎవరు ఎక్కడ చదివారో చూడండి.!

ఐఐటీలో చదువుకుని దేశం గర్వించదగ్గ స్థాయిలో ఉన్న 15 మంది ప్రముఖులు.! ఎవరు ఎక్కడ చదివారో చూడండి.!

by Anudeep

Ads

ఇండియా లో ఐఐటి యూనివర్సిటీ (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) కి ఎంత పేరు ప్రఖ్యాతలు ఉన్నాయో ప్రత్యేకం గా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ యూనివర్సిటీ లో సీటు కోసం ఎంతోమంది విద్యార్థులు కలలు కంటూ ఉంటారు. కనీసం ఏ గ్రూప్ లో అయిన సీటు వచ్చిన చాలు అనుకునేవారు కూడా చాలామందే ఉన్నారు. అయితే… ఈ యూనివర్సిటీ లో చదువుకుని ప్రపంచవ్యాప్తం గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఇండియన్స్ ని మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Video Advertisement

#1 సుందర్ పిచాయ్ – ఐఐటి ఖరగ్ పూర్

Sundar Pichai
గూగుల్ సీఈఓ గా పనిచేసిన సుందర్ పిచాయ్ గురించి తెలియని వారు ఎవరు ఉండరు. గూగుల్ క్రోమ్ సృష్టి వెనక కూడా సుందర్ పిచాయ్ మాస్టర్ బ్రెయిన్ ఉంది. చెన్నై నివాసి అయిన పిచాయ్ సుందరరాజన్ ఐఐటి ఖరగ్ పూర్ లో మెటలర్జీ ఇంజనీరింగ్ స్ట్రీమ్ లో బిటెక్ చదువు పూర్తి చేసారు.

#2 ఎన్.ఆర్.నారాయణమూర్తి – ఐఐటి కాన్పూర్

N.R. Narayan Murthy
ఇన్ఫోసిస్ ఫౌండర్ మరియు మాజీ చైర్మన్ అయిన నారాయణ మూర్తి ఐఐటి కాన్పూర్ లో తన మాస్టర్స్ డిగ్రీ ని పూర్తి చేసారు. ఇన్ఫోసిస్ కంపెనీ కి ఎంత ఖ్యాతి లభించిందో చెప్పక్కర్లేదు. నారాయణ మూర్తి గారికి కూడా ఎన్నో అవార్డులు, పురస్కారాలు లభించాయి. భారత విశేష పురస్కారాలైన పద్మశ్రీ, పద్మ విభూషణ్ పురస్కారాలను కూడా ఆయన అందుకున్నారు.

#3 అరవింద్ కేజ్రీవాల్ – ఐఐటి ఖరగ్ పూర్

Arvind Kejriwal
ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ ఫౌండర్ అరవింద్ కేజ్రీవాల్ గురించి ప్రత్యేకం గా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన కూడా ఐఐటి ఖరగ్ పూర్ లోనే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసారు.

#4 చేతన్ భగత్ – ఐఐటి ఢిల్లీ:

Chetan Bhagat
చేతన్ భగత్ పుస్తకాల గురించి తెలియని వారు అరుదుగానే ఉంటారు. ఆయన రాసిన 5 పాయింట్ సమ్ వన్, త్రీ మిస్టేక్స్ ఆఫ్ మై లైఫ్, హాఫ్ గర్ల్ ఫ్రెండ్ వంటి పుస్తకాలు మిల్లియన్లలో అమ్ముడుపోయాయి. ఆయన కూడా ఐఐటి ఢిల్లీ లో చదువుకున్నారు.

#5 రఘురాం గోవింద రాజన్ – ఐఐటి ఢిల్లీ

Raghuram Govinda Rajan
ఇండియన్ ఎకనామిస్ట్ రఘురాం గోవింద రాజన్ కూడా మనందరికీ సుపరిచితులే. రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా కి ఆయన 23 వ గవర్నర్ గా పనిచేసారు. అలాగే వైస్ చైర్మన్ గా కూడా తన సేవలు అందించారు.

#6 దీపిందర్ గోయల్ – ఐఐటి ఢిల్లీ

Deepinder Goyal
ఫౌండర్ ఆఫ్ జొమాటో గా దీపిందర్ గోయల్ అందరికి తెలిసిన వ్యక్తే. ఆయన ఐఐటి ఢిల్లీ లో మాథ్స్ అండ్ కంప్యూటింగ్ చదివారు.

#7 వినోద్ ఖోస్లా – ఐఐటీ ఢిల్లీ

Vinod Khosla
వినోద్ ఖోస్లా సన్ మైక్రోసిస్టమ్స్ కో ఫౌండర్. 2004 లో, ఆయన తన వెంచర్ క్యాపిటలిస్ట్ సంస్థ ఖోస్లా వెంచర్స్ ను స్థాపించాడు. ఆయన ఐఐటీ ఢిల్లీ లో బిటెక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ను చదివారు.

#8 రోహిత్ బన్సాల్ – ఐఐటి ఢిల్లీ

Rohit Bansal
కామర్స్ దిగ్గజం, స్నాప్‌డీల్ వ్యవస్థాపకుడు రోహిత్ బన్సాల్ ఐఐటి ఢిల్లీ లోనే చదివారు. బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన తరువాత, రోహిత్ బన్సాల్ తన పాఠశాల స్నేహితుడు కునాల్ బహల్‌తో కలిసి స్నాప్‌డీల్‌ను స్థాపించాడు.

#9 జితేంద్ర కుమార్ – ఐఐటి ఖరగ్ పూర్

Jitendra Kumar
ప్రముఖ నటుడు గా జితేంద్ర కుమార్ ఫేమస్ అయ్యారు. జీతు భయ్యా నుండి గిట్టు వరకు కోటా ఫ్యాక్టరీ, టివిఎఫ్ పిచర్స్, పంచాయతీ వంటి సిరీస్‌లలో ఆయన తన ప్రతిభ కనబరిచారు. ఈ నటుడు ఐఐటి ఖరగ్‌పూర్‌లో సివిల్ ఇంజనీరింగ్ చదివారు మరియు ఐఐటి కెజిపిలో హిందీ టెక్నాలజీ డ్రామాటిక్స్ సొసైటీ గవర్నర్ పదవిలో ఉన్నారు.

#10 బిస్వా కళ్యాణ్ రాత్ – ఐఐటి ఖరగ్ పూర్

Biswa Kalyan Rath
ఈయన హాస్యనటుడు, చమత్కారాలు మరియు పంచ్‌లైన్‌లకు ప్రసిద్ధి చెందారు. బిష్వా కళ్యాణ్ రాత్ 2012 లో ఐఐటి ఖరగ్‌పూర్ నుండి బయోటెక్నాలజీలో బిటెక్ పూర్తి చేసి గ్రాఫిక్ డిజైన్, అడ్వర్టైజింగ్, సాఫ్ట్‌వేర్‌లో పనిచేశారు. 2014 లో, బిష్వా ఒరాకిల్‌లో ఉద్యోగం మానేసి హాస్య నటుడిగా మారారు.

#11 భవిష్ అగర్వాల్ – ఐఐటీ పొవాయ్, ముంబై

Bhavish Aggarwal
ఓలా క్యాబ్స్ సహ వ్యవస్థాపకుడు భవీష్ అగర్వాల్ భారతీయుల ప్రయాణంలో విప్లవాత్మక మార్పులు చేశారు. ఐఐటి బొంబాయి నుండి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన తరువాత, మైక్రోసాఫ్ట్‌లో సహాయ పరిశోధకుడిగా పనిచేశారు.

#12 సచిన్ బన్సాల్ – ఐఐటి ఢిల్లీ గ్రాడ్యుయేట్

Sachin Bansal
ఫ్లిప్‌కార్ట్‌తో సచిన్ బన్సాల్ భారతదేశంలో కామర్స్ రంగం లో అనేక మార్పులు తీసుకొచ్చారు. 2005 లో ఐఐటి ఢిల్లీ నుండి కంప్యూటర్ ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసిన తరువాత, సచిన్ బన్సాల్ కామర్స్ దిగ్గజం అమెజాన్ కోసం పనిచేశారు. 2007 లో అమెజాన్ నుంచి బయటకు వచ్చిన సచిన్ బన్సల్ తన కల సాకారం చేసుకోవడం కోసం ఆన్‌లైన్ పుస్తక విక్రేతగా ఫ్లిప్‌కార్ట్‌ను స్థాపించాడు.

#13 రిచా సింగ్ – ఐఐటి గౌహతి

 Richa Singh
పరీక్షలలో తక్కువ స్కోరు సాధించినందుకు తోటి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న తరువాత, భవిష్యత్తులో జరిగే సంఘటనలను నివారించడానికి రిచా సింగ్ నిశ్చయించుకున్నారు. ఐఐటి గౌహతి గ్రాడ్యుయేట్ యువర్‌డోస్ట్ అనే ఆన్‌లైన్ పోర్టల్‌ను సృష్టించింది. ఇది ఎవరితోనైనా, గోప్యంగా, ఉచితంగా మాట్లాడటానికి అందుబాటులో ఉన్న వెబ్సైటు. ఎవరైనా సరే ఈ వెబ్సైటు ద్వారా సలహాదారులతో మాట్లాడి స్వాంతన పొందవచ్చు.. ఆత్మహత్య వంటి ఆలోచనలనుంచి దూరం కావచ్చు.

#14 పరుల్ గుప్తా – ఐఐటి బొంబాయి

 Parul Gupta
పరుల్ గుప్తా స్ప్రింగ్‌బోర్డ్ వ్యవస్థాపకురాలు. స్ప్రింగ్‌బోర్డ్‌తో, విద్యార్థులు నేర్చుకోగలిగే వేదికను అందించాలని ఆమె లక్ష్యంగా పెట్టుకుంది మరియు సాంప్రదాయ విద్యా విధానానికి ఆమె ప్రత్యామ్నాయాన్ని తీసుకొస్తోంది.

#15 మనోహర్ పారికర్ – ఐఐటి బొంబాయి

 Manohar Parrikar
ఆయన పూర్తి పేరు మనోహర్ గోపాల్ కృష్ణ. ఆయనను మనోహర్ పారికర్ అని పిలుస్తుంటారు. ఆయన గోవా కు పదవ ముఖ్యమంత్రి గా పనిచేసారు. ఆయన 1978 లో ఐఐటి ముంబై నుండి మెటలర్జికల్ ఇంజనీరింగ్‌లో బిటెక్ పూర్తి చేశాడు. భారత రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన మొదటి ఐఐటి గ్రాడ్యుయేట్ మనోహర్ పారికర్ గారు.


End of Article

You may also like