ఈ 15 సినిమాలకు సీక్వెల్ ప్రకటించారు…కానీ ఇప్పటివరకు తెరకెక్కలేదు.! ఇక లేనట్టేనా.?

ఈ 15 సినిమాలకు సీక్వెల్ ప్రకటించారు…కానీ ఇప్పటివరకు తెరకెక్కలేదు.! ఇక లేనట్టేనా.?

by Anudeep

Ads

ఏదైనా ఒక సినిమా ఆడియన్స్ కు బాగా రీచ్ అయ్యి హిట్ అయితే.. ఆ సినిమా కి సీక్వెల్ కూడా తీయాలని భావిస్తారు. ఏదైనా సినిమా బాగా నచ్చితే.. ఆడియన్స్ కూడా సీక్వెల్ ఉంటె బాగుండు అని కోరుకోడం సహజమే. అయితే.. కొన్ని సినిమాలకు సీక్వెల్ ను అనౌన్స్ చేసినా.. ఇప్పటివరకు ఈ సినిమాల షూటింగ్ పట్టాలెక్కలేదు. ఈ సినిమాలు ఉంటాయా..? ఉండవా? అన్న డౌట్ ప్రేక్షకుల్లో కూడా ఉంది. ఇంతకీ.. ఆ 15 సినిమాలు ఏంటో ఓ లుక్ వేయండి.

Video Advertisement

sequel movies telugu

#1 క్రాక్ – 2

1 krack

వరుస ఫ్లాపుల తరువాత టాలీవుడ్ మాస్ మహారాజ్ ను మాస్ కమ్ బ్యాక్ తో తీసుకొచ్చింది ఈ సినిమా. ఈ సినిమా లో శృతి హాసన్ హీరోయిన్ గా నటించారు. ఈ సినిమా కి కూడా సీక్వెల్ ఉంటుందని అన్నారు కానీ.. ఎలాంటి అప్ డేట్ లేదు.

#2 జాంబీ రెడ్డి:

2 zomby reddy

ఇంద్ర సినిమా లో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్  తేజ సజ్జా ప్రస్తుతం హీరో గా సినిమాలు చేస్తున్నారు. తేజ హీరో గా నటించిన సినిమా జాంబిరెడ్డి. ఈ సినిమా సీక్వెల్ గురించి కూడా ఎలాంటి అప్ డేట్స్ ఇంకా రాలేదు.

#3 అ! 2 :

3 a movie

కాజల్ నటించిన అ! మూవీ ని నాని నిర్మించారు. ఈ సినిమాకి కూడా సీక్వెల్ అనౌన్స్ చేసారు కానీ.. ఇప్పటి వరకు షూటింగ్ పట్టాలెక్కలేదు.

#4 ఖైదీ2 :

4 khaidi

కార్తీక్ హీరో గా నటించిన ఖైదీ మూవీ తెలుగు నాట కూడా సూపర్ హిట్ అయింది. ఈ సినిమా కూడా సీక్వెల్ వస్తుందన్నారు. ఇప్పటివరకు ఎలాంటి అప్ డేట్ లేదు.

#5 అదుర్స్ 2 :

adurs

ఎన్టీఆర్ డబుల్ రోల్ లో నటించిన అదుర్స్ సినిమా చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఈ సినిమా కూడా సీక్వెల్ రావాల్సి ఉంది.

#6 అడవి2:

6 adavi

అప్పుడెప్పుడో రామ్ గోపాల్ వర్మ, నితిన్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా “అడవి”. ఈ సినిమా సీక్వెల్ అనౌన్స్ చేసారు గాని ఇప్పటివరకు అడుగు కూడా ముందుకు పడలేదు.

#7 ఈగ 2 :

7 eega

రాజమౌళి దర్శకత్వం లో నాని, సమంత హీరో, హీరోయిన్లు గా నటించిన సినిమా ఈగ. ఈ సినిమా కి కూడా సీక్వెల్ ఉంటుందని చెప్పారు కానీ.. ఇప్పటివరకు మొదలుకాలేదు.

#8 విక్రమార్కుడు 2 :

8 vikramarkudu

రాజమౌళి కి బాగా ఇష్టమైన సినిమా ఇది. దీనికి సీక్వెల్ ని కూడా తీయాలనుకుంటున్నట్లు రాజమౌళి గతం లో కూడా చెప్పాడు. కానీ ఇప్పటి వరకు ఇందుకు సంబంధించిన పనులేవీ మొదలు కాలేదు.

#9  జెంటిల్ మెన్ 2 :

9 gentlemen

జెంటిల్ మెన్  సినిమా నిర్మాత రీసెంట్ గానే ఈ సినిమా సీక్వెల్ గురించి ప్రకటన చేసారు. కానీ.. చూస్తే ఇది కూడా పట్టాలెక్కేలా లేదు.

#10 తుపాకీ2 :

10 tupaki

విజయ్ హీరో గా నటించిన ఈ సినిమా తెలుగునాట కూడా మంచి పేరు తెచ్చుకుంది. ఈ సినిమా కి కూడా సీక్వెల్ అనౌన్స్ చేసారు కానీ.. ఇప్పటివరకు పట్టాలెక్కలేదు.

#11 కబాలి 2 :

11 kabali

రజనీకాంత్ హీరో గా నటించిన కబాలి సినిమా కి కూడా సీక్వెల్ అనౌన్స్ చేసారు. కానీ.. ఇప్పటివరకు కొంచం కూడా ముందుకు నడవలేదు.

#12 రాజా ది గ్రేట్ 2 :

12 raja the great

ఈ సినిమా కూడా సీక్వెల్ తీస్తామని అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు కానీ.. ఆ దిశ లో అడుగులు పడుతున్నట్లు లేవు.

#13 రాజా సర్దార్ గబ్బర్ సింగ్ :

13 raja sardar gabbarsingh

పవర్ స్టార్ “గబ్బర్ సింగ్” సీక్వెల్ గా సర్దార్ గబ్బర్ సింగ్ వచ్చింది. దీనికి కంటిన్యుషన్ గా “రాజా సర్దార్ గబ్బర్ సింగ్ ” ను అనౌన్స్ చేసారు కానీ.. ఇప్పటివరకు ఆ దిశలో ప్రయత్నాలు అయితే జరగలేదు.

#14 కిక్ 3:

14 kick 3

కిక్ కి కంటిన్యుషన్ గా కిక్ 2 కూడా వచ్చింది. తరువాత కిక్ 3 కూడా ప్లాన్ చేసారు కానీ షూటింగ్ మాత్రం మొదలవలేదు.

#15 బిజినెస్ మెన్ 2 :

15 business man 2

దర్శకుడు పూరి జగన్నాధ్ బిజినెస్ మెన్ సినిమా రిలీజ్ అయినప్పుడు సీక్వెల్ కూడా ఉంటుందని చెప్పుకొచ్చారు. ఇప్పటివరకు ఆ పనులేవీ మొదలైనట్లు లేవు.


End of Article

You may also like