కాస్టింగ్ కౌచ్ అంటూ ఆరోపణలు చేసిన వనితా విజయ్ కుమార్.. రమ్యకృష్ణ ఇచ్చిన రెస్పాన్స్ అదిరిందిగా..!

కాస్టింగ్ కౌచ్ అంటూ ఆరోపణలు చేసిన వనితా విజయ్ కుమార్.. రమ్యకృష్ణ ఇచ్చిన రెస్పాన్స్ అదిరిందిగా..!

by Anudeep

Ads

 

నిత్యం ఎదో ఒక కామెంట్స్ తో నటి వనితా విజయ్ కుమార్ వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. అప్పట్లో మూడవ వివాహం తో వార్తల్లోకెక్కిన వనిత తాజాగా మరో సారి సీనియర్ నటి పై పలు ఆరోపణలు చేసారు. కొంతకాలం మీడియా కి దూరం గా ఉన్నప్పటికీ.. వనిత ఇటీవల బిగ్ బాస్ తో తెరపైకి వచ్చిన సంగతి విదితమే. “బిగ్ బాస్ జోడిగల్” షో లో పాల్గొన్న వనిత ఉన్నట్లుండి షో నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.

Video Advertisement

vanitha 1

ఈ క్రమం లో ఆమె ఓ ట్వీట్ చేసారు. కాస్టింగ్ కౌచ్, అవమానాలు, వేధింపులు అంటూ ఆమె చేసిన ట్వీట్లు వైరల్ అయ్యాయి. ఇటీవల ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఓ సీనియర్ నటి వల్లనే ఆమె షో నుంచి బయటకు వచ్చినట్లు చెప్పారు. ఆ షో లో సీనియర్ మోస్ట్ నటి అంటే రమ్యకృష్ణ గారే. ఆమె ఈ షో కి హోస్ట్ గా కూడా వ్యవహరిస్తున్నారు. అంటే.. రమ్యకృష్ణ ని ఉద్దేశించే ఆమె ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని భావిస్తున్నారు.

vanitha 2

ఈ క్రమం లో ఓ కోలీవుడ్ న్యూస్ ఛానెల్ ఈ సంగతి గురించి రమ్యకృష్ణ ని కూడా అడిగారు. ఈ వివాదం విషయమై రమ్యకృష్ణ చాలా హుందా గా వ్యవహరించారు. “షో లో ఏమి జరిగిందో కూడా మీరు ఆమెని ప్రశ్నించి ఉండాల్సింది ” అని రమ్యకృష్ణ బదులిచ్చారు. “నాకు సంబంధించి ఇది చాలా విషయమని.. నో కామెంట్స్” అని ఆమె బదులిచ్చారు.


End of Article

You may also like