తింటూ వీడియో లు తీసి.. లక్షలు సంపాదించేస్తున్న కూలి..! ఇతని గురించి తెలుసుకుంటే అబ్బురపడతారు..!

తింటూ వీడియో లు తీసి.. లక్షలు సంపాదించేస్తున్న కూలి..! ఇతని గురించి తెలుసుకుంటే అబ్బురపడతారు..!

by Anudeep

Ads

ఒకప్పటి కంటే ఇప్పుడు సోషల్ లైఫ్ ను గడపడానికి ఎక్కువ గా అవకాశం ఉంది. యు ట్యూబ్, ఫేస్ బుక్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాలు మనుషుల మధ్య దూరాన్ని తక్కువ చేస్తున్నాయి. ఇటీవల యు ట్యూబ్ లో వ్లాగ్స్ కూడా చాలా ట్రెండింగ్ లో ఉంటున్నాయి. కంటెంట్ ఉండాలి గాని.. ఇటువంటి వీడియోలకు లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి. దానికి తగ్గట్టే సంపాదన కూడా ఉంటోంది.

Video Advertisement

isaak 2

విభిన్నం గా ఏమి చేసినా వారికి మంచి ఆదరణ లభిస్తుంది. తాజాగా 35 ఏళ్ల ఇసాక్ కూడా లాక్ డౌన్ ను సద్వినియోగం చేసుకుని కొత్త ఉపాధిని వెతుక్కున్నాడు. సంబల్‌పూర్ జిల్లాలోని బాపుపాలిలో నివసించే ఇసాక్ లాక్ డౌన్ విధించడం తో ఏమి చేయాలో తోచలేదు. అతనికి ఒక సొంత ఫోన్ కూడా లేదు. ఓ రోజు తన ఫ్రెండ్ ఫోన్ లో యు ట్యూబ్ వీడియో లు చూసి బాగా ఇన్స్పైర్ అయ్యాడు. తనకు కూడా ఒక ఐడియా వచ్చి మూడు వేల రూపాయల ఖరీదు తో ఒక మొబైల్ ఫోన్ ను కొనుగోలు చేసాడు.

isaak 3

ఆ ఫోన్ తోనే తన ఊరిలోని విషయాలను చెబుతూ, తన ఊరి పరిసరాలను చూపిస్తూ వీడియో లు తీసేవాడు. అలా తీసిన వీడియో లను యు ట్యూబ్ లో అప్ లోడ్ చేసేవాడు. తమ ఊరిలో ప్రజలు ఏ ఆహరం తీసుకుంటారు..? ఎలాంటి జీవన విధానాన్ని సాగిస్తున్నారు..? వారికి ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి చెబుతూ వీడియో లు తీసేవాడు. రోజూ తానూ ఏమి తింటాడో కూడా చెబుతూ వీడియో తీసేవాడు. ఇసాక్ మొదట అప్ లోడ్ చేసిన వీడియో కి 4.99 లక్షల వ్యూస్ వచ్చాయి.

isaak 1

ఆ తరువాత ఇసాక్ వెనుతిరిగి చూడలేదు. వరుస గా ఇప్పటివరకు 250 వీడియో లను పోస్ట్ చేసాడు. ఇసాక్ ఆదాయాన్ని ఆశించి ఈ పని మొదలుపెట్టలేదు. కానీ, వీడియో లు అప్ లోడ్ చేయడం మొదలు పెట్టిన తరువాత ఇసాక్ బాగానే ఆదాయం వచ్చింది. మొదటి వీడియో అప్ లోడ్ అయిన మూడు నెలలకు ఇసాక్ అకౌంట్ లో ముప్పై ఏడు వేల రూపాయలు వచ్చాయి. మరో మూడు నెలలకి ఏకం గా ఐదు లక్షల రూపాయలు వచ్చాయి.

isaak 4

ఈ వీడియోస్ గురించి మాట్లాడిన ఇసాక్ తానూ ఏడవతరగతి వరకు మాత్రమే చదువుకున్నట్లు చెప్పాడు. కేవలం తమ ఊరి ఆచారాల గురించి, సంప్రదాయాల గురించి అందరికి తెలియ చెప్పడం కోసమే వీడియోలు చేయాలనుకున్నానని చెప్పాడు. ఇసాక్ నడుపుతున్న యు ట్యూబ్ ఛానెల్ కు ఇప్పటి వరకు 7.37 లక్షల సబ్స్క్రైబర్లు జమ అయ్యారు.


End of Article

You may also like