Ads
మెగా బ్రదర్ నాగబాబు గురించి కొత్త గా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నటుడి గా, నవ్వుల రారాజు గా అందరికి నాగబాబు సుపరిచితుడే. కొన్ని సార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం వలన ఆయన వార్తల్లోకెక్కారు. అయితే.. నాగబాబు కనిపించని సాయాలు ఎన్నో చేశారు. వాటి గురించి జూనియర్ ఆర్టిస్ట్ బొంబాయి పద్మ చెప్పుకొచ్చారు.
Video Advertisement
నాగబాబు తన వద్దకు వచ్చిన ఎవ్వరిని ఖాళి చేతులతో పంపరని ఆమె చెప్పుకొచ్చారు. ఓ సారి ఆమె ఇబ్బందుల్లో ఉన్నపుడు నాగబాబు దగ్గరికి వెళితే.. ఆయన తన వద్ద ఉన్న కాంటాక్ట్స్ ను ఉపయోగించి ఆమెకు వర్క్ దొరికేలా చేశారట. నాకు సహాయం చేసినందుకు నాగ బాబుకు నేను కృతజ్ఞతలు చెబుతున్నానని బొంబాయి పద్మ చెప్పుకొచ్చారు. ఆ తరువాత కొంత టాలెంట్ ద్వారా పని చేసుకున్నాను. నాగబాబు ఇలా ఎంతమందికి సాయం చేశారో నేను చూసాను అంటూ ఆమె చెప్పుకొచ్చారు.
నా కళ్ళ ముందే నాగబాబు ఒకరికి నగదు ఇచ్చి సాయం చేశారని పద్మ అన్నారు. ఐతే.. ఇలా చేయడం వలన నాగబాబు మోసపోయారని చాలామంది అంటూ ఉంటారు.. అది కూడా నాగబాబు పట్టించుకోరని.. “అయితే అవనివ్వండి.. నా దగ్గరకు వచ్చారు. నా దగ్గరకి వచ్చిన వారిని ఖాళీ చేతులతో పంపను” అని నాగబాబు చెప్పేవారట.
End of Article