“అప్పుడు ఏడిస్తే ఆపండ్రా అన్నారు.. ఇప్పుడు మాత్రం కచ్చితం గా ఏడుస్తారు”.. అంటూ వెంకీ మామ ఎమోషనల్.. ఎందుకంటే..?

“అప్పుడు ఏడిస్తే ఆపండ్రా అన్నారు.. ఇప్పుడు మాత్రం కచ్చితం గా ఏడుస్తారు”.. అంటూ వెంకీ మామ ఎమోషనల్.. ఎందుకంటే..?

by Anudeep

Ads

విక్టరీ వెంకటేష్ నటించిన “నారప్ప” సినిమా ఈ నెల 20 న విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ ఓటిటి లో విడుదల అవుతోంది. వెంకటేష్ ఫాన్స్ ఈ సినిమా కోసం ఎంత గానో ఎదురుచూసారు. అయితే.. ఈ సినిమా థియేటర్ లో కాకుండా ఓటిటి లో విడుదల అవుతుండడం పట్ల ఫాన్స్ కొంచం అసంతృప్తి గా ఉన్నారు.

Video Advertisement

venkatesh

ఐతే.. సినిమా ఓటిటి లో విడుదలయ్యే విషయమై వెంకటేష్ పాజిటివ్ గానే స్పందించారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఓటిటి హవా పెరిగిందని.. పరిస్థితులకు తగ్గట్లే మనం కూడా మారాలని అన్నారు. అయితే ఈ విషయం లో ఫాన్స్ కు క్షమాపణ చెప్పాల్సిందేనన్నారు. కొన్నాళ్ళకు థియేటర్లు ఓపెన్ అయితే తిరిగి ఈ హవా తగ్గుతుందని అన్నారు. ఈ మధ్య కాలం లో డిఫరెంట్ గా అనిపిస్తున్న కథలు రావడం లేదని.. ఒక్కోసారి వరసగా కథలు వస్తుంటాయని.. ఒక్కోసారి ఖాళీ సమయాన్ని గడపాల్సి వస్తుందని.. ఇది సాధారణం గా జరిగేదే అని అన్నారు.

dhanush

ఇక, సినిమా గురించి మాట్లాడుతూ.. ఈ సినిమా లో నారప్ప పాత్ర చాలా టఫ్ అని..అందుకే ఈ కథ టేకింగ్ నచ్చి ఎంపిక చేసుకున్నానన్నారు. ఇక “అసురన్” సినిమాలో ధనుష్ అద్భుతం గా చేసారని, తనకు ఛాలెంజ్ ని ఇచ్చారని వెంకటేష్ ప్రశంసించారు. తన కెరీర్ లో ఎప్పుడు ఇలాంటి పాత్రను చేయలేదని చెప్పుకొచ్చారు.

venkatesh 2

nనా కెరీర్ మొదట్లో ఎమోషనల్ అయితే ఆపండ్రా అంటూ కామెంట్ లు చేసేవారని గుర్తుచేసుకున్నారు. అప్పట్లో ఈ కామెంట్ లు చూసి..”ఇలా ఉంటారా” అని అనుకునేవాడినని.. కెమెరా ముందు ఎమోషనల్ అయితే మాత్రం బాగా కనెక్ట్ అయ్యేవారని గుర్తు చేసుకున్నారు. “నారప్ప” లో కూడా చాలా ఎమోషనల్ సీన్స్ ఉన్నాయని.. ఇప్పుడు కచ్చితం గా ఏడిపిస్తా అని వెంకటేష్ చెప్పుకొచ్చారు.

 


End of Article

You may also like