Ads
ఇటీవల బోనాల సందర్భం గా అమ్మవారి పై సింగర్ మంగ్లీ పాడిన పాడిన పాట ఎంత వివాదాస్పదమైందో చూస్తూనే ఉన్నాం. అమ్మవారిని “మోతెవరి” అని పిలిచినందుకు సోషల్ మీడియా లో నానా రచ్చ చేసారు. కాపీ పాట అని.. అమ్మ వారిని తిడుతూ పాడారు అని.. ఇలా రకరకాలుగా ట్రోల్ చేసారు.
Video Advertisement
భక్తులను దృష్టిలో ఉంచుకుని గేయ రచయితా ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి అయినప్పటికీ.. వెనక్కి తగ్గి ఈ పాటలో మార్పులు చేసారు. అయినప్పటికీ ట్రోల్స్ తగ్గలేదు. ఆ పాట లో లైన్స్ ని మార్చేదాకా రెండు మూడు.. రోజుల పాటు ఈ రచ్చ కొనసాగుతూనే వచ్చింది. ఈ విషయమై మంగ్లీ వివరణ కూడా ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా.. విడుదలైన “వరుడు కావలెను” అనే సినిమా ప్రోమో సాంగ్ లో మరో పాటను ఇలాగే వాడారు.
హిందువులు ఎంతో భక్తిగా పూజించుకునే నాగరాజా స్వామి పాట “దిగు దిగు నాగన్న..” పాట ట్యూన్ ను కాపీ చేస్తున్నట్లు ఉంది ఈ ప్రోమో సాంగ్. “దిగు దిగు నాగా..దివ్యా సుందర నాగో నాగా..” అంటూ ఈ పల్లవి కొనసాగుతుంది. ఈ పాట నేపధ్యం కూడా ఐటెం సాంగ్ లాగ ఉండడం గమనార్హం. ఈ సినిమా లో నాగ సౌర్య, రీతూ వర్మ హీరో హీరోయిన్లు గా నటిస్తున్నారు. థమన్ సంగీత దర్శకత్వం వహించాడు.
ఈ పాటను అనంత్ శ్రీరామ్ రచించారు. శ్రేయ ఘోషల్ ఈ పాటను ఆలపించారు. మంగ్లీ పాడిన పాట విషయం లో అంత రచ్చ చేసిన వారు.. మరి ఈ భక్తి పాటను ఐటెం సాంగ్ తరహా లో చిత్రీకరించడం వివాదాస్పదమవుతుందా..? అన్న సందేహాలు నెలకొంటున్నాయి. ఇదే విషయమై “ముచ్చట” కూడా ప్రశ్నించింది. ఈ పాటను “సర్పయాగం” మూవీ లో కూడా ఐటెం సాంగ్ తరహా గానే ఉపయోగించారని ఓ నెటిజెన్ పేర్కొన్నారు. మరొక నెటిజెన్ అయితే.. “బ్లేడ్ బాబ్జి” లో కూడా వాడారు అని చెప్పారు. ఐతే.. బ్లేడ్ బాబ్జి లో మాత్రం దీనిని భక్తి పాట గానే ఉపయోగించారు.
End of Article