Ads
ప్రస్తుతం బంధాలు, స్నేహాలు అన్ని అవసరం కోసమే అన్న విషయం అందరికి తెలిసిందే. కరోనా మహమ్మారి వచ్చిన తరువాత దేశం లో పేదరికం, నిరుద్యోగం మరింత పెరిగింది. చాలా మంది జాబ్ లు పోగొట్టుకున్నారు. కార్పొరేట్ యాజమాన్యాలలో చాలా వరకు ఏరు దాటాక తెప్ప తగలేసే రకాలే ఉంటాయి. ఉద్యోగులను అవసరాలకు ఉంచుకుని తీరగానే తీసేస్తుంటాయి.
Video Advertisement
దీనివలన ఉన్నట్లుండి రోడ్డున పడే వారు ఎందరో ఉంటున్నారు. ఈ పెద్దాయన పరిస్థితి కూడా అలాంటిదే. ఉన్నట్లుండి ఉద్యోగం పోవడం తో ఫామిలీ ని బతికించుకోవడం కోసం రోడ్డున పడ్డాడు. తన ఫ్యామిలి కోసం ఎంతో కొంత సాయం చేయాలంటూ రోడ్డున వెళ్లేవారిని రిక్వెస్ట్ చేస్తున్నాడు. తాజాగా.. అతనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియా లో వైరల్ అయింది.
ఈ వీడియో లో ఆయన తన గురించి చెప్పుకొచ్చారు. ఇలా రోడ్డు పై తిరుగుతున్న టైం లో కూడా తన జూనియర్స్, తన క్లాస్ మేట్ ఒకరు తనను చూసి కూడా చూడకుండా వదిలేసినట్లు చెప్పి బాధపడ్డారు. అవేమి తాను పట్టించుకోనని.. తన ఫామిలీ కోసమే తాను కష్టపడతానని చెప్పుకొచ్చారు. చాలా మంది తానెవరో తెలియకపోయినా.. తనకు ఎంతో కొంత డొనేట్ చేసారని.. చాలా మంది మంచివాళ్ళు ఉన్నారని చెప్పుకొచ్చారు.
ఉద్యోగ ప్రయత్నాలను కూడా చేస్తున్నానని.. ఏదైనా ఉద్యోగం దొరికితే తప్పకుండ చేసుకుంటానని.. అప్పటివరకూ నా ఫ్యామిలి రోడ్డున పడకుండా ఉండడం కోసం తప్పడం లేదని ఆవేదన చెందారు. ఆయన వీడియో చూసిన నెటిజన్లు ఆయనకు సపోర్ట్ గా మాట్లాడుతున్నారు. ఈ వయసులో కూడా ఆయన తన ఫ్యామిలి కోసం తాపత్రయ పడుతుండడం అందరికి కన్నీళ్లు తెప్పిస్తోంది. ఆ వీడియో ను మీరు కూడా కింద చూడొచ్చు.
Watch Video:
End of Article