Ads
ఒకప్పటి అమెరికన్ ప్రెసిడెంట్ అబ్రహం లింకన్ తెలియని వారెవరూ ఉండరు. ఆయన తన కుమారుడిని మొదటి సారి స్కూల్ కి పంపిస్తున్నప్పుడు.. టీచర్ కు ఈ విధం గా లెటర్ రాసి పంపించారట. ఆయన రాసిన లేఖను అందరికి అందించాలనే ఉద్దేశ్యం తో ప్రముఖ అనువాదకురాలు శాంత సుందరి గారు ఈ లేఖను తెలుగు లోకి అనువాదం చేశారు. ఆ లేఖ ను మీరు కూడా చూసేయండి.
Video Advertisement
” ఈరోజు మా అబ్బాయిని మొట్ట మొదటి సారిగా స్కూల్ కి పంపిస్తున్నాము. తనకి ఇప్పటివరకు తెలియని ప్రపంచం లోకి పంపిస్తున్నాం కాబట్టి.. ఇదంతా కొత్త గా అనిపిస్తూ ఉంటుంది. ఒక ఉపాధ్యాయుడు గా మీరు పిల్లవాడితో సున్నితం గా మెలగుతారని కోరుకుంటున్నాను. వాడి జీవితం లో ఇదో సాహస ఘట్టమే. ఈ ధైర్యం ఎన్ని ఒడిదుడుకులనైనా ఎదుర్కోగల సమర్ధతను అందిస్తుందని భావిస్తున్నా.. మా అబ్బాయికి కొన్ని విషయాలు మీరు నేర్పించాలని ఆశిస్తున్నా..
జీవితం లో సుఖం ఉన్న చోట దుఃఖం కూడా ఉంటుందని.. ఓటమి ఉన్న చోట గెలుపు కూడా ఉంటుందని తెలియ చెప్పండి. జీవితం అనే యుద్ధం లో ప్రేమ, నమ్మకం, ధైర్యం అనేవి తోడు ఉండాలని సవివరం గా తెలపండి. మీరు దగ్గరుండి.. ప్రేమ పూర్వకం గా ఈ విషయాలను నేర్పిస్తారని ఆశిస్తున్నా. మిత్రుడున్న చోటే శత్రువు కూడా ఉంటాడని తెలియ చెప్పాలి. అందరు నిజాయితీ గా ఉండరని, న్యాయపూర్వకం గా వ్యవహరించరు అన్న సత్యాన్ని బోధించండి..
తేరగా వచ్చిన పదివేల రూపాయల కంటే.. కష్టపడి సంపాదించుకున్న వంద రూపాయలు ఎంతో గొప్పవని నేర్పించండి. పాఠశాలలో మోసం చేసి మార్కులు సంపాదించుకోవడం కంటే.. కష్టపడి చదవడం.. లేక ఓడిపోవడం కూడా గౌరవాన్ని తెస్తుంది అని నేర్పించండి. ఓడిపోయినప్పుడు మనస్పూర్తి గా అంగీకరించడం నేర్పించండి. అందరితోనూ మృదువు గా మెలగాలన్న విషయాన్నీ తెలియ చెప్పండి.
చప్పుడు చేయకుండా నవ్వాలని.. అసూయ కు ఆరడుగుల దూరం లో ఉండాలని నేర్పించండి. కన్నీళ్లు పెట్టుకోవడం వల్ల వచ్చే అవమానం ఏది లేదని తెలియ చెప్పండి. విచారం లో కూడా నవ్వడం నేర్చుకోవాలని తెలపండి. గెలుపు లో కూడా బాధ ఉండొచ్చు.. ఓటమి లో కూడా సంతోషం ఉండొచ్చు అని నేర్పించండి. పుస్తకాలు ఎంత మంచి స్నేహితులో.. అవి ఎన్ని అద్భుతాలు చేయగలవో తెలపండి. అందరు గుడ్డి గా ఫాలో అయ్యే దాన్ని కాకుండా.. తన మనసుకు నచ్చిన దానిని చేయనివ్వండి.
మేధస్సుని ఎక్కువ ధరకే అమ్మమని చెప్పండి.. అంతే తప్ప హృదయానికి, ఆత్మకు లంకె పెట్టి, వాటికి వెల నిర్ణయించుకోవద్దని చెప్పండి. అసహనం వచ్చినప్పుడు వ్యక్తపరిచే ధైర్యాన్ని.. ఎల్ల వేళలా ధైర్యాన్ని నింపి ఉంచే ఓర్పుని అలవర్చుకోవాలని చెప్పండి. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలని.. అప్పుడే సమాజం పైనా.. దేవుడిపైనా విశ్వాసం ఉంచగలడని తెలపండి. సాధ్యమైనంత వరకు మంచి పిల్లవాడిగా మలుస్తారని ఆశిస్తున్నా.. మీ పై నాకు ఆ నమ్మకం ఎప్పుడూ ఉంటుంది.
End of Article