Ads
చిన్నప్పుడు నుంచి చదువు తప్ప మరో లోకం లేని నాకు.. అతనే లోకమయ్యాడు. నా ప్రేమను తెలుపుదామనుకునేసరికి.. అతనికి పెళ్లయిందని తెలిసింది. ఓ రోజు స్నేహ హస్తం చెప్పేసరికి స్నేహంగా ఉంటే తప్పేంటనిపించింది.
Video Advertisement
ఉన్నట్లుండి.. అతని వైఖరి లో మార్పు నన్ను క్షోభకి గురి చేస్తోంది. నా స్టోరీ చదివి.. నాకు సలహా ఇస్తారని ఆశిస్తున్నాను.
నా పేరు శ్రీని. స్కూల్, కాలేజెస్ లో ఎప్పుడూ నేనే టాపర్ ని. కానీ చదువైపోయి జాబ్ వచ్చాక భయమేసింది. ఆ టైం లో విక్కీ అనే అబ్బాయి చాలా సపోర్ట్ చేసాడు. సేమ్ క్యాడర్ కావడం తో ఆఫీస్ వర్క్ లో సహాయం కూడా చేసేవాడు. సైలెంట్ గా ఉండేవాడు. ఆడవాళ్లంటే బాగా రెస్పెక్ట్ ఉన్న అతన్ని చూస్తే నాకు ముచ్చటేసింది. తనని ప్రేమిస్తున్నానని లేటు గా తెలుసుకున్నా. ఓ రోజు తనకు చెప్పేయాలి అనుకున్నా.. కానీ నా ఫ్రెండ్ నువ్వు ఆడపిల్లవు.. ముందు చెప్తే బాగుండదు అని చెప్పడం తో ఆగిపోయాను.
తరువాత రోజే.. అతన్ని ఇష్టపడ్డావ్ కానీ.. అతనికి ముందే పెళ్లయింది అన్న సంగతి తెలియదా..? అని నా ఫ్రెండ్ అడగడం తో షాక్ అయ్యా. దానితో.. అతనికి దూరం గా ఉండడం స్టార్ట్ చేశా. ఓ రోజు వచ్చి.. నేను దూరం పెట్టడానికి కారణమేంటి..? మనం మంచి స్నేహితులు గా ఉండొచ్చు కదా.. అని అడిగేసరికి కాదనలేకపోయా. అలా మా ఇద్దరిమధ్యా స్నేహం చిగురించింది. కానీ మేము ఎప్పుడూ హద్దులు మీరలేదు.
కానీ.. ఆఫీస్ లో మాత్రం మా మధ్య ఏదో నడుస్తోంది అన్న గుసగుసలు మాత్రం వినిపించేవి. అవి మేము పట్టించుకునేవాళ్ళం కాదు. ఓ సారి నాకు మంచి జాబ్ ఆఫర్ వస్తే.. నేను వెళ్ళడానికి విక్కీ ఒప్పుకోలేదు. దూరం గా ఉండలేం అంటూ చెప్పాడు. కానీ.. దూరం మనల్ని వేరు చేయలేదు.. మన స్నేహం ఎప్పటికి విడిపోదు అని చెప్తూ వీడ్కోలు తీసుకున్నా. కానీ తనని చూడలేక అప్పుడప్పుడు తన ఊరు వెళ్లేదాన్ని.
ఉన్నట్లుండి తనలో మార్పు. ప్రతిదానికి విసుగు, చిరాకు చూపించేవాడు. నా పాలిట దరిద్రం లా దాపురించావ్ అంటూ ఉండేవాడు. నేనేమి తప్పు చేశానని ఇలా ప్రవర్తిస్తున్నాడో అర్ధం కావడం లేదు.. తన మీద ఇష్టం పోగొట్టుకోలేక.. తనతో స్నేహం గా ఉన్న రోజులు గుర్తొస్తుంటే.. బాధ కలుగుతోంది. తనని ఎలా మరిచిపోవాలి..? తన ప్రవర్తనని ఎలా అర్ధం చేసుకోవాలి..? తగిన సలహా ఇస్తారని భావిస్తున్నా.
End of Article