బిగ్ బాస్ హౌస్ కి వచ్చిన ట్రాన్స్ జెండర్ ప్రియాంక గతం తెలిస్తే కన్నీళ్లే.. అమ్మాయి గా ఎందుకు మారాల్సొచ్చింది..?

బిగ్ బాస్ హౌస్ కి వచ్చిన ట్రాన్స్ జెండర్ ప్రియాంక గతం తెలిస్తే కన్నీళ్లే.. అమ్మాయి గా ఎందుకు మారాల్సొచ్చింది..?

by Anudeep

Ads

ఎట్టకేలకు ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 మొదలయ్యింది. సాధారణంగా అయితే ఈ ప్రోగ్రాంలో సినీ రంగానికి చెందిన సెలబ్రిటీలని మాత్రమే ఎక్కువగా తీసుకుంటారు. కానీ ఈసారి మాత్రం సినిమా రంగానికి చెందిన ప్రముఖులతోపాటు సోషల్ మీడియాకు చెందిన ప్రముఖులను కూడా తీసుకున్నారు. అంతే కాకుండా సీరియల్ నటులు కూడా ఇందులో కంటెస్టెంట్స్ గా పాల్గొంటున్నారు. మనకి నచ్చిన సెలెబ్రిటీ నిజ జీవితంలో ఎలా ఉంటారో తెలుసుకోవాలనే ఆసక్తి మనలో చాలా మందికి ఉంటుంది. అందుకే ఈ ప్రోగ్రాంకి అంత క్రేజ్ ఉంది. ఈసారి బిగ్ బాస్ తెలుగు-5 కంటెస్టెంట్స్ గా హౌస్ లోకి అడుగు పెట్టిన వారిలో ప్రియాంక ఒకరు.

Video Advertisement

priyanka 2

ప్రియాంక అందరికి జబర్దస్త్ ఆర్టిస్ట్ గా పరిచయం. అసలు ప్రియాంక జన్మించినప్పుడు తల్లితండ్రులు పెట్టిన పేరు సాయి తేజ. అయితే.. అతను సర్జరీ చేయించుకుని మగువ గా మారారు. ఆ తరువాత జబర్దస్త్ వేదిక పై కూడా తన టాలెంట్ ను నిరూపించుకుని పాపులర్ అయ్యారు. తాజాగా జబర్దస్త్ ఐదవ సీజన్ లో కూడా ఆమె ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. స్టేజి పై తన వీడియో ను చూసుకున్న ప్రియాంక చాలా సంతోషించారు. ఆ తరువాత మాట్లాడుతూ నోటా మాట రావడం లేదంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. నాగార్జున ను గ్రీకువీరుడు సినిమా షూటింగ్ లో కలిసాను అని.. అప్పుడు సాయి తేజ గా కలిసాను అని.. ఇప్పుడు ప్రియాంక గా కనిపిస్తున్నా అంటూ పేర్కొన్నారు.

priyanka 3

నీవు చాలా మందికి ఇన్స్పిరేషన్ అంటూ నాగార్జున ప్రియాంక ను ప్రశంసించారు. ఆమె తన వ్యక్తిగత విషయాలను కూడా ఇక్కడ చెప్పుకున్నారు. చిన్నప్పటి నుంచి తనలో అమ్మాయి గా కనిపించాలన్న కోరిక ఉండేదని.. కానీ కుటుంబ సభ్యులను దృష్టిలో ఉంచుకుని ఎవరికీ చెప్పుకునే దాన్ని కాదని చెప్పుకొచ్చారు. నాకు ఇద్దరు అక్కలు, ఇద్దరు అన్నయ్యలు, ఒక చెల్లి ఉన్నారని చెప్పారు. తన పై వారందరికీ పెళ్లిళ్లు చేసేశారని.. నాకు కూడా పెళ్లి చేయాలనుకుంటే నా వల్ల ఓ అమ్మాయి జీవితం నాశనం అవ్వకూడదని.. రాత్రికి రాత్రే అమ్మాయి గా మారానని అన్నారు.

priyanka 1

నా తండ్రి లాబ్ లో అటెండర్ గా పని చేసేవారని.. ఓ ప్రయోగ సమయం లో ఆసిడ్ కారణం గా ఆయన తన కళ్ళను పోగొట్టుకున్నారని చెప్పుకొచ్చారు. అందుకే… నేను అమ్మాయి గా మారిన విషయం నా తండ్రికి ఇంకా తెలియదని.. ఆయనకు తెలియచెప్పాడు బిగ్ బాస్ కంటే మంచి వేదిక దొరకదని ప్రియాంక తన మనసులో బాధను వ్యక్తపరిచారు. నాగార్జున ఆమెను తండ్రి పేరేంటి అని అడగగా.. డిబి సింగ్ అని బదులిచ్చారు.. మీ తండ్రి నీ బాధని కచ్చితం గా అర్ధం చేసుకుంటారు అంటూ నాగార్జున ప్రియాంక ను ఓదార్చారు.


End of Article

You may also like