Ads
అబుదాబి వేదికగా గురువారం రాత్రి కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుకి, ముంబై ఇండియన్స్ జట్టుకి మధ్య జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు విజయం సాధించింది. టాస్ గెలిచిన కోల్‌కతా కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (7) ఫీల్డింగ్ ఎంచుకున్నారు. డికాక్ (55: 42 బంతుల్లో 4×4, 3×6) తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించిన రోహిత్ శర్మ (33: 30 బంతుల్లో 4×4) మ్యాచ్ ప్రారంభంలో దూకుడుగా ఆడారు. కానీ డికాక్ టాప్ గేర్ లోకి వెళ్లిన తర్వాత ఇన్నింగ్స్ 10వ ఓవర్ లో అవుట్ అయ్యారు. తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (5), ఇషాన్ కిషన్ (14), కీరన్ పొలార్డ్ (21: 15 బంతుల్లో 2×4, 1×6), కృనాల్ పాండ్యా (12: 9 బంతుల్లో 1×6) ఆఖరి ఓవర్ లో వరుసగా అవుట్ అయ్యారు. దాంతో ముంబై ఇండియన్స్ జట్టు 155 స్కోర్ చేసింది.
Video Advertisement
156 పరుగుల లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టులో శుభమన్ గిల్ (13: 9 బంతుల్లో 1×4, 1×6), వెంకటేష్ అయ్యర్ (53: 30 బంతుల్లో 4×4, 3×6) చెరో సిక్స్ చేశారు. తర్వాత వచ్చిన బుమ్రా, ఆడమ్ మిల్నేకి బౌండరీల బాధ తప్పలేదు. రాహుల్ త్రిపాఠి (74 నాటౌట్: 42 బంతుల్లో 8×4, 3×6) భారీ షాట్లతో దూసుకెళ్లారు. దాంతో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు 15.1 ఓవర్లలోనే 159/3 స్కోర్ చేసింది. ఈ మ్యాచ్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
#16
End of Article