Ads
రెండు, మూడు సార్లు వాయిదా పడిన తర్వాత లవ్ స్టోరీ సినిమా చివరికి థియేటర్లలో విడుదల అయ్యింది. సినిమా బృందం కూడా ముందు నుంచి చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఈ సినిమా థియేటర్లలో చూడవలసిన సినిమా అని, అది కూడా కేవలం యూత్ మాత్రమే కాకుండా, కుటుంబం అంతా చూడాల్సిన సినిమా అని చెప్పారు. శేఖర్ కమ్ముల కూడా ఈ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్తూ అంచనాలను పెంచేశారు.
Video Advertisement
శేఖర్ కమ్ముల సినిమాల్లో మితిమీరిన హీరోయిజం, సంబంధం లేని ఫైట్స్ ఉండవు. హాయిగా ఒక ఇన్సిడెంట్ అలా జరుగుతున్నట్లు మూవీ నడుస్తూ వెళ్ళిపోతుంది. అదే ఫీల్ ను ప్రేక్షకులు కూడా ఎక్స్పెక్ట్ చేసారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడిన శేఖర్ కమ్ముల ఈ సినిమా షూటింగ్ టైం లో జరిగిన విషయాలను పంచుకున్నారు. ఈ సినిమాలో నాగచైతన్య కు తల్లి గా నటించిన నటి ఈశ్వరి రావు గురించి శేఖర్ కమ్ముల ఆసక్తికర విషయాన్నీ పంచుకున్నారు.
లవ్ స్టోరీ సినిమా లో ఆమె ఓ పేద క్యారెక్టర్ లో నటించాల్సి ఉంది. ఆ క్యారెక్టర్ కోసం ఫస్ట్ లో ఆడిషన్స్ జరిగాయి. అందుకు రావాల్సింది గా నటి ఈశ్వరి రావు ను కూడా కోరారట. ఈ ఆడిషన్స్ కోసం ఆమె కేవలం 80 రూపాయల చీరను కట్టుకుని వచ్చారట. ఆమెను అలా చూసి ఆశ్చర్య పోయాను అంటూ శేఖర్ కమ్ముల చెప్పుకొచ్చారు. ఇలాంటి నటిని ఎప్పుడు చూడలేదు అంటూ నటి ఈశ్వరి పై ప్రశంసల జల్లు కురిపించారు. ఈశ్వరి రావు అరవింద సమేత, కాలా, అలా వైకుంఠ పురం లో సినిమాల్లో కూడా నటించిన సంగతి తెలిసిందే.
End of Article