Ads
పూజా కు ప్రభాస్ కు మధ్య పొసగడం లేదు అంటూ ఈ మధ్య ఫిలిం వర్గాల్లో గుస గుసలు వినిపిస్తున్నట్లు నెట్టింట్లో కధనాలు కనిపిస్తున్నాయి. పూజా హెగ్డే కు ప్రభాస్ కు మధ్య విభేదాలు తలెత్తాయని.. సాన్నిహిత్యం లేకుండా సినిమాలో నటించలేమని వీరు అంటున్నారని ఈ కధనాల సారాంశం. పూజా హెగ్డే షూటింగ్ కి లేట్ గా రావడం తో ప్రభాస్ అసహనం వ్యక్తం చేస్తున్నారట.
Video Advertisement
ఇటీవల పాపులారిటీ ఎక్కువై.. ఎక్కువ ప్రాజెక్ట్స్ ను సొంతం చేసుకుంటున్న పూజా హెగ్డే షూటింగ్ కి లేటు గా వస్తున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. పూజా హెగ్డే, ప్రభాస్ తో కలిసి రాధేశ్యాం లో నటించిన సంగతి తెలిసిందే. ఇంకా కొంత భాగం షూటింగ్ మిగిలి ఉంది. ఈ క్రమం లో ఈ వార్తలు వస్తుండడం తో చిత్ర యూనిట్ అలెర్ట్ అయింది. మొత్తానికి క్లారిటీ ఇచ్చేసింది. ఈ వార్తల్లో నిజం లేదని, పూజా చాలా మంచి నటి అని, నిబద్ధత కలిగిన వ్యక్తి అని కితాబిచ్చారు. ప్రభాస్ తో ఆమెకు ఉన్న ఆఫ్ స్క్రీన్ సాన్నిహిత్యం.. తెరపై వారిద్దరూ అద్భుతంగా కెమిస్ట్రీ పండడానికి దోహదం చేసిందని చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది.
End of Article