కూతురు సురేఖ ను అల్లుడు చిరంజీవి చేతిలో పెడుతూ.. అల్లు రామలింగయ్య గారు ఏం చెప్పారో తెలుసా?

కూతురు సురేఖ ను అల్లుడు చిరంజీవి చేతిలో పెడుతూ.. అల్లు రామలింగయ్య గారు ఏం చెప్పారో తెలుసా?

by Anudeep

Ads

ఇండస్ట్రీ లో మెగాస్టార్ కి ఎంతటి పేరు ప్రఖ్యాతలున్నాయో ప్రత్యేకం గా చెప్పక్కర్లేదు. అలాగే.. చిరంజీవి, సురేఖ దాంపత్యానికి కూడా మంచి పేరు ఉంది. వారిద్దరూ ఎంతో అన్యోన్యం గా ఉంటారని ఇండస్ట్రీ లో పేరు ఉంది. అయితే.. సురేఖ తండ్రి గారు అల్లు రామలింగయ్య మనందరికీ స్టార్ కమెడియన్ గా సుపరిచితులు. సురేఖ ను చిరంజీవి కి ఇచ్చి పెళ్లి చేయాలనీ వారు ఎప్పుడు అనుకున్నారు..? పెళ్ళికి ముందు కథ ఎలా నడిచింది.. అనేది ఇప్పుడు చూద్దాం.

Video Advertisement

allu ramalingayya 1

చిరంజీవి కి సురేఖ ను ఇచ్చి పెళ్లి చేసే సమయానికి.. అల్లు రామలింగయ్య స్టార్ కమెడియన్ గా ఫామ్ లో ఉన్నారు. మరో వైపు చిరంజీవి కూడా హీరో పాత్రలు చేస్తూ నిలదొక్కుకుంటున్నారు. చిరంజీవి లో మంచి నటుడు ఉన్నాడు అని గుర్తించిన అల్లు రామలింగయ్య తన కుమార్తె ను చిరంజీవికి ఇచ్చి వివాహం చేసారు. వీరిద్దరికి వివాహం జరగడం లో జయకృష్ణ కీలక పాత్ర పోషించారు అని చెబుతూ ఉంటారు.

allu ramalingayya 2

మనవూరి పాండవులు సినిమాలో చిరంజీవి అల్లు రామలింగయ్య తో కలిసి నటించారు. ఆ టైం లో రామలింగయ్య గారు లేరు. ఆయన సతీమణి కాఫీ కలిపి ఇచ్చారట. ఆ కాఫీ ని కూడా సురేఖ గారే కలిపారు అని చెప్తారు. పెళ్లి అయ్యిన తరువాత చిరంజీవి సురేఖను ఆ కాఫీ ఇచ్చిన రోజున నన్ను చూసావా? అని అడిగారట. కానీ సురేఖ గారు చూడలేదని చెప్పారట.

allu ramalingayya 3

ఆ తరువాత, అల్లు రామలింగయ్య కూడా చిరంజీవి గురించి ఎంక్వైరీ చేసుకున్నారట. జయకృష్ణ కూడా చిరంజీవి గురించి మంచిగా చెప్పడం తో అల్లు రామలింగయ్య కి చిరంజీవి పై సదభిప్రాయం ఏర్పడింది. ఆయన కైకాల సత్యనారాయణను కూడా చిరంజీవి గురించి అడిగారట. ఆయన కూడా చిరు గురించి గొప్పగా చెప్పడం తో సురేఖ ను ఇచ్చి పెళ్లి చేయాలనీ ఫిక్స్ అయిపోయారు. అనుకున్నట్లే వారిద్దరికీ పెళ్లి జరిపించారు.

సురేఖ ను చిరంజీవి చేతుల్లో పెడుతూ..”నువ్వేమో చాలా స్పీడు.. మా అమ్మాయి కొంచం మెతక.. నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి..” అని అల్లు రామలింగయ్య చిరు కు చెప్పారట. ఆయనకు ఇచ్చిన మాట ప్రకారం చిరంజీవి ఇప్పటికి సురేఖ గారిని జాగ్రత్తగా చూసుకుంటున్నారు.


End of Article

You may also like