Sreemukhi: తన అభిమాని పంపిన నాలుగు పేజీల లేఖ చూసి షాక్ అయిన శ్రీముఖి ! అందులో ఏముందంటే ?

Sreemukhi: తన అభిమాని పంపిన నాలుగు పేజీల లేఖ చూసి షాక్ అయిన శ్రీముఖి ! అందులో ఏముందంటే ?

by Anudeep

Ads

బుల్లి తెర పై నటి & యాంకర్ శ్రీముఖి పాపులారిటీ అంత ఇంతా కాదు..ఒక చిన్న సెలబ్రిటీ ఫంక్షన్ కి యాంకరింగ్ అయినా ఒక పెద్ద హీరో ఆడియో ఫంక్షన్ లేదా ఇంటర్వ్యూ అయినా శ్రీముఖి పక్కా ఉంటారు. అంతే కాదు యాంకర్ సుమ తరువాత అంతటి పాపులారిటీ ని సంపాదించిన శ్రీ ముఖి.. అటు సినిమాల్లో కూడా బిజీ అయ్యారు. తాజాగా శ్రీముఖి తన ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో ఓ విషయాన్ని పంచుకున్నారు.

Video Advertisement

srimukhi

ఆమెకు తన అభిమాని నుంచి ఓ నాలుగు పేజీల ఉత్తరం వచ్చింది. చివరలో వెంకట్ అని పేరు ఉండడం తో.. వెంకట్ అనే అభిమాని ఆ ఉత్తరం పంపారు అని తెలుస్తోంది. అయితే.. అంతకుమించి సదరు అభిమాని వివరాలు ఏమి తెలియవు. కానీ ఆ అభిమాని అచ్చ తెలుగులో.. శ్రీముఖి కెరీర్ ప్రారంభం నుంచి ఉన్న విశేషాలను అందం గా పొందుపరిచారు. ఈ లెటర్ చూసాక, శ్రీముఖి తన అంతరంగాన్ని స్టేటస్ లో పంచుకున్నారు.

srimukhi 2

ఈ అభిమాని ఎవరో తెలీదు కానీ, సోషల్ మీడియా లో టాగ్ లు చేసే ఈ కాలం లో కూడా ఇలా పోస్ట్ లో ఓ ఉత్తరాన్ని పంపడం, అందులో నా గురించి అచ్చ తెలుగు లో రాయడం, నా కెరీర్ లో ప్రతి విషయాన్ని గుర్తుంచుకుని చెప్పడం చాలా సంతోషాన్ని ఇస్తోందని తన స్టోరీ లో రాసుకొచ్చారు. మీరెవరో తెలీదు గాని, మనస్పూర్తి గా ధన్యవాదాలు చెబుతున్నా అంటూ శ్రీముఖి తన ఇన్స్టా ​స్టోరీ లో రాసుకొచ్చారు.


End of Article

You may also like