స్టయిలిస్ట్ ప్రీతమ్‌ జుకల్కర్‌ ఎవరు..? సమంత కి ఎలా పరిచయం అయ్యారు..?

స్టయిలిస్ట్ ప్రీతమ్‌ జుకల్కర్‌ ఎవరు..? సమంత కి ఎలా పరిచయం అయ్యారు..?

by Anudeep

Ads

ప్రస్తుతం ఎక్కడ చూసిన సమంత-నాగ చైతన్యల జంట విడాకులు తీసుకోవడం గురించే చర్చ జరుగుతోంది. ముక్కుపచ్చలారని అందమైన బంధం చై-సామ్ ల బంధం. దీనిని ఇంత త్వరగా తెంచేసుకుంటారు అని ఎవరు ఊహించలేదు. గత వారం, పది రోజులు గా వీరు విడిపోతున్నారు అంటూ సోషల్ మీడియా లో ఓ రేంజ్ లో వార్తలు వచ్చాయి. ఈ పుకార్లని నిజం చేస్తూ.. చై, సమంత ఇద్దరు తమ సోషల్ మీడియా అకౌంట్స్ లో అధికారికంగా విడిపోతున్నట్లు ప్రకటించారు.

Video Advertisement

pritam 1

ఈ క్రమం లో వారిద్దరూ విడిపోవడానికి పలు కారణాలను నెటిజన్లు ఊహించేసుకుంటున్నారు. కొందరు నెటిజన్లు అయితే ఏకం గా స్టయిలిస్ట్ ప్రీతమ్ పైనే పడ్డారు. అతని వల్లే చై, సామ్ లు విడిపోతున్నారు అంటూ కధనాలు వచ్చాయి. మరోవైపు నెటిజన్లు ప్రీతమ్ ను తిట్టిపోస్తున్నారు. చాలా దురుసుగా మాట్లాడుతుండడంతో.. ప్రీతమ్ సైతం కొంతమందికి గట్టిగానే సమాధానం ఇచ్చారు. నెటిజన్లు ప్రీతమ్ ను ట్రోల్ చేయడం మాత్రం ఆపడం లేదు. కొన్ని నెలల క్రితం ప్రీతమ్ బర్త్ డే సందర్భంగా అతని ఒళ్ళో కాళ్ళు పెట్టుకుని పడుకున్న ఫోటో ఒకదాన్ని సమంత షేర్ చేసారు.

pritam 4

దీనితో సామ్ లైఫ్ లో అతని ఎంట్రీ వల్లే చై-సామ్ ల మధ్య గొడవలు వచ్చాయని అందరు అనుకుంటున్నారు. అసలు ఈ ప్రీతమ్ జుకల్కర్ ఎవరు..? సమంతకి ఎలా పరిచయమయ్యారో ఇప్పుడు చూద్దాం. ప్రీతమ్ వయసు 33 సంవత్సరాలు. హైదరాబాద్ లోనే పుట్టి పెరిగారు. ఫ్యాషన్ డిజైనింగ్ నే తన వృత్తి గా ఎంచుకున్నారు. అతని తల్లి మిషన్ కుట్టేవారు. ఆమెను చూసే తాను కూడా డిజైనర్ ను అవ్వాలి అన్న దృఢ సంకల్పంతో కష్టపడ్డారు.

pritham 3

మంచి అవుట్ పుట్ ఇస్తుండడంతో తక్కువ టైంలోనే ప్రీతమ్ కు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తరువాత భారతీయ వస్త్ర సంప్రదాయమైన చేనేత దుస్తుల్ని పైకి తేవాలన్న సంకల్పంతో పనిచేసాడు. సమంత కూడా అందుకు తోడయ్యింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేనేత వస్త్రాల వాడకాన్ని ప్రోత్సహించే దిశగా ఓ కార్యక్రమాన్ని చేపడితే.. దానికి సమంత మద్దతు తెలిపింది. ఈ క్రమంలోనే ప్రీతమ్ కు, సమంత కు పరిచయం ఏర్పడింది.

pritham 2

కాటన్ వస్త్రాలకు సంబంధించి ఫ్యాషన్ దుస్తుల్ని రూపొందించడంలో ప్రీతమ్ కు మంచి పేరు వచ్చేసింది. బయట పలు ఈవెంట్ లకు వెళ్లే సమయంలో సమంత కు మంచి అవుట్ ఫిట్స్ ను డిజైన్ చేసి ఇచ్చేవారు. కేవలం సమంతకే కాదు, రకుల్, రాశి ఖన్నాలకు కూడా ప్రీతమ్ అవుట్ ఫిట్స్ ను డిజైన్ చేసారు. ప్రీతమ్ వర్క్ బాగుండడంతో.. ఇండస్ట్రీలో మంచి పేరు వచ్చింది.


End of Article

You may also like