Ads
మొక్కై వంగనిది మానై వంగునా..? అంటూ ఉంటారు. పిల్లలకు చిన్నప్పటి నుంచే అన్ని విషయాలపైనా అవగాహన కల్పించాలి అనేది ఈ సామెత ఉద్దేశ్యం. దీనిని మరీ సీరియస్ గా తీసుకున్న ఓ తల్లి తన ఏడేళ్ల కొడుకు చేత ఇంటి రెంట్, కరెంట్ బిల్స్, ఇంటర్నెట్ బిల్స్ వంటివి కట్టించేస్తోంది. డబ్బులు ఇచ్చి కట్టించడం కాదు.. ఆ పిల్లాడే నెల మొత్తం లో సంపాదించుకునే విధంగా మనీ లెసన్స్ చెబుతోంది.
Video Advertisement
ఆశ్చర్యం గా ఉంది కదా.. ఏడేళ్ల పిల్లాడు ఎలా సంపాదిస్తాడు అని.. అక్కడే మనం ఆ తల్లిని మెచ్చుకోవాలి. ఫ్లోరిడా కు చెందిన ఓ మహిళ ఇటీవల ఓ వీడియో ను పోస్ట్ చేసింది. ఆమె తన పేరుని వెల్లడించకపోయినా.. ఆమె చేస్తున్న పని ఇతర తల్లితండ్రులకు స్ఫూర్తినిచ్చే విధంగా ఉంది. తన ఏడేళ్ల కొడుక్కి విద్యాబుద్ధులతో పాటు డబ్బు విలువ ను తెలియచేయడం కోసం ఆమె ఓ ప్రణాళిక రూపొందించింది.
ఇందులో భాగం సదరు పిల్లాడు తన పనులు తానె చేసుకోవాల్సి ఉంటుంది. అంటే బ్రష్ చేసుకోవడం, తన పక్క సర్దుకోవడం, బట్టల అల్మారా ను నీట్ గా ఉంచుకోవడం, బుక్స్ సర్దుకోవడం, తన బాత్ రూమ్ ను నీట్ గా ఉంచుకోవడం, మురికి బట్టలను వాషింగ్ మెషిన్ లో పడేయడం లాంటి పనులన్నమాట. ఈ పనులన్నీ సక్రమం గా చేస్తే ఆ రోజు ఒక డాలర్ ను తన కొడుక్కి జీతం గా ఇస్తుంది.
ఈ డబ్బును ఆ పిల్లాడు దాచుకుంటాడు. నెల అంతా పూర్తయ్యాక తాను ఇంట్లో ఉంటున్నందుకు రెంట్, తన రూమ్ కరెంటు బిల్ ను తల్లికి కట్టేస్తాడు. మిగిలిన డబ్బుతో తాను వాడుకున్న ఇంటర్నెట్ కు బిల్ కట్టుకుంటాడు. ఒకవేళ ఒక నెలలో కట్టలేకపోతే.. ఆ డబ్బుని కూడా తర్వాత నెలలో కట్టే లాగా ఒప్పందం కూడా చేసుకుంటాడట. ఇలా చిన్న వయసునుంచే ఆ తల్లి తన కొడుక్కి డబ్బు విలువ ను తెలియ చేస్తోంది. భవిష్యత్ లో తన కొడుకు లైఫ్ ని చక్కగా ప్లాన్ చేసుకుంటాడు అంటూ ఆ తల్లి ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది.
Watch video here: Link
End of Article