Ads
అబుదాబి వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకి, సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకి మధ్య జరిగిన మ్యాచ్ లో 4 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు విజయం సాధించింది. టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ ఎంచుకున్నారు. ఓపెనర్ జేసన్ రాయ్ (44: 38 బంతుల్లో 5×4) తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఓపెనర్ అభిషేక్ శర్మ (13: 10 బంతుల్లో 1×4, 1×6) భారీ షాట్ కోసం ప్రయత్నిస్తూ రెండో ఓవర్ లో అవుటయ్యారు. తర్వాత వచ్చిన కెప్టెన్ కేన్ విలియమ్సన్ (31: 29 బంతుల్లో 4×4) తో కలిసి ఓపికగా ఆడిన జేసన్ రాయ్, రెండో వికెట్ కి 70 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
Video Advertisement
ఇన్నింగ్స్ 12వ ఓవర్ లో ఉన్నప్పుడు కేన్ విలియమ్సన్ అవ్వగా తర్వాత వచ్చిన ప్రియమ్ గార్గ్ (15), అబ్దుల్ సమద్ (1), సాహా (10), జేసన్ హోల్డర్ (16) భారీ షాట్ కోసం ప్రయత్నిస్తూ వరుసగా వికెట్లు చేజార్చుకున్నారు. చివరిలో రషీద్ ఖాన్ (7 నాటౌట్: 9 బంతుల్లో 1×4) బౌండరీ కొట్టడంతో హైదరాబాద్ జట్టు 140 పరుగుల మార్క్ అందుకుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు హర్షల్ పటేల్ మూడు వికెట్లు, క్రిస్టియాన్ రెండు వికెట్లు, చాహల్ ఒక వికెట్, గార్టన్ ఒక వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
#16
End of Article