Ads
ఇంటికి దీపం ఇల్లాలు అని ఊరికే అంటారా..? కుటుంబాన్ని, ఇంటిని ఒంటిచేత్తో నెట్టుకొస్తూ.. కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటుంది ఏ ఇల్లాలైనా. అందుకే మహిళలు మల్టి టాలెంటెడ్ అని చెప్పొచ్చు. ఎన్ని పనులు ఉన్నా సమర్ధవంతం గా చక్కబెట్టుకుంటూ ఉంటారు. అవకాశాలు రావాలే కానీ, వారు తమ ప్రతిభను నిరూపించుకోవడానికి ఏమాత్రం వెనుకాడరు. విజయా రాజన్ కూడా అంతే.. ఆమెకు తన భర్త, పిల్లల ఆరోగ్యమే ముఖ్యం.
Video Advertisement
వారికి పోషకాలతో కూడిన ఆహారాన్ని అందించాలని నిత్యం అనుకుంటూ ఉండేది. అలాంటి వాటిపైనే తాను చాలా రీసెర్చ్ చేసింది. అలాంటి పోషకాలు ఎందులో దొరుకుతాయో పరిశీలించి వాటితో స్నాక్స్ లాంటివి తయారు చేసేది. వాటిని భర్తకు, పిల్లలకు, చుట్టూ పక్కన వారికి పెట్టేది. వారికి అవి బాగా నచ్చడం తో.. ఆమె సన్నిహితులు వాటిని ఎందుకు అమ్మకూడదు? అని ప్రశ్నించారు. బయట ఇలాంటి మార్కెట్ దొరకడం లేదని, ఇలాంటివాటిని అమ్మితే.. కచ్చితం గా జనాలకి మంచి ఫుడ్ దొరుకుతుంది, మనకి కూడా లాభం ఉంటుందని చెప్పడం తో విజయ ఆ దిశగా ఆలోచించింది.
ఆమె భర్త రాజన్ శ్రీనివాసన్ టెలికాం ఉద్యోగం చేస్తున్నారు. ఆయన రన్నర్, సైక్లిస్ట్, స్విమ్మర్ గా పేరు తెచ్చుకున్నారు. 2015 లో ఇంగ్లీష్ చానెల్ లో స్విమ్ చేయడం కోసం శిక్షణ తీసుకున్నారు. అయితే.. అందుకు బాగా శక్తీ కావాల్సి ఉంటుంది. విజయ ఆయనకు అలాంటి ఆహారాన్ని అందించాలనుకుంది. ఎక్కువ పోషకాలు కలిగి ఉండి, తక్కువ కాలోరీలతో ఎక్కువ ఎనర్జీను అందించే స్నాక్స్ ను తానె తయారు చేసింది. అందులో ఎక్కువ గా డ్రై ఫ్రూట్స్ ను ఉపయోగించి తయారు చేసింది.
పంచదార, ప్రిజర్వేటివ్స్ లాంటివి ఏమి లేకుండా ఆమె స్నాక్స్ ను తయారు చేసేది. వీటికి తన ఫ్యామిలీ సర్కిల్ లో మంచి పేరు రావడం తో వ్యాపారం చేయాలనీ భావించింది. అందుకోసం.. ఈ ప్రొడక్ట్స్ కు “సిరిమిరి” అనే పేరును నిర్ణయించుకుంది. కన్నడం లో సిరిమిరి అంటే లక్ష్మి దేవి. 2017 లో ఈ స్టార్ట్అప్ ను ప్రారంభించింది. కేవలం 15 మంది పనివాళ్ళతో, రెండు లక్షల పెట్టుబడి తో ఇది మొదలైంది. తన కుటుంబం కోసం చేసే స్నాక్స్ కు కొద్దీ గా మార్పు చేర్పులు చేసి.. ఎనర్జీ బార్ లా మార్కెట్ లో ప్రవేశపెట్టింది.
వీటికి క్రమం గా గుర్తింపు రావడం మొదలైంది. ఈ స్టార్ట్ అప్ ప్రారంభం లో కేవలం మూడు రకాల ఎనర్జీ బార్ లను మాత్రమే విజయ అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే.. వీటికి మంచి గుర్తింపు రావడం తో ప్రస్తుతం ఆరు కండరాలకు పుష్టినిచ్చే బార్‌లు, 8 హెల్ది బార్స్, మరో హెల్థీ మిక్స్ ప్రొడక్ట్స్ ను విక్రయిస్తున్నారు. రెండు లక్షల తో మొదలైన ఈ వ్యాపారం ప్రస్తుతం కోట్ల టర్న్ ఓవర్ తో నడుస్తోంది. ఆడవాళ్లు అనుకుంటే.. దేనినైనా సాధించగలరు అని విజయా రాజన్ నిరూపించారు.
End of Article