Ads
ప్రస్తుతం వరుస సినిమాల్లో షూటింగ్ తో బిజీగా ఉన్న హీరోల్లో ప్రభాస్ ఒకరు. రాధేశ్యాం తో పాటు ఆదిపురుష్, సలార్ సినిమాల షూటింగ్ లో కూడా ప్రభాస్ పాల్గొంటున్నారు. ఇవి మాత్రమే కాకుండా, మన తెలుగు సినిమాల ప్రమోషన్ ఈవెంట్స్ లో కూడా ప్రభాస్ అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటారు. అయితే ప్రభాస్ 25వ సినిమా తాలూకు అప్ డేట్ రీసెంట్ గా అనౌన్స్ చేశారు. ఈ సినిమాకి అర్జున్ రెడ్డి సినిమాలో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ పోలీసు పాత్రలో కనిపించబోతున్నారు అని సమాచారం. టైటిల్ “స్పిరిట్” అని పెట్టారు. ఇది కూడా పాన్ ఇండియన్ సినిమాగా విడుదల అవుతోంది.
Video Advertisement
అయితే, ఈ అప్ డేట్ కోసం ఫాన్స్ చాలా కాలమే వెయిట్ చేసారు. పోస్టర్ లో ప్రభాస్ లుక్ రిలీజ్ చేస్తారు అని బాగా ఎక్స్పెక్ట్ చేసారు. కానీ.. ఆ అంచనాలను ఏమి రీచ్ కాకుండా ఈ పోస్టర్ ను చాలా సాదా సీదా గా టైటిల్ నేమ్ ను మాత్రం రివీల్ చేస్తూ రిలీజ్ చేసారు. అప్ డేట్ రావడం తో ఫాన్స్ ఫుల్ ఖుష్ అయ్యారు.. కానీ పోస్టర్ పై మాత్రం కొంత అసంతృప్తి వ్యక్తమైంది.
ఇందులో.. ప్రభాస్ పోలీస్ గా నటిస్తున్నారని ప్రచారం జోరుగా సాగుతోంది. కానీ, పోస్టర్ లో మాత్రం కనీసం ప్రభాస్ లుక్ పై ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. దీనివల్ల కూడా ఫాన్స్ కొంచం అప్ సెట్ అయ్యారు. మరోవైపు.. ఈ సినిమా ఎప్పుడు షూటింగ్ స్టార్ట్ అవుతుందో.. ఇంకెప్పుడు రిలీజ్ అవుతుందో.. అని కూడా ఫాన్స్ కొంచం ఎక్సయిటింగ్ ఫీల్ అవుతున్నారు. ఇది ఇలా ఉండగానే.. సోషల్ మీడియా లో ఫాన్స్ తయారు చేసిన పోస్టర్స్ వైరల్ అవుతున్నాయి. ఒరిజినల్ కంటే ఇవే బాగున్నాయిగా అనిపించేలా ఉన్నాయి. వాటిపై మీరు కూడా ఓ లుక్ వేయండి.
#1.
#4.
End of Article