Ads
అబుదాబి వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకి, ముంబై ఇండియన్స్ జట్టుకి మధ్య జరిగిన మ్యాచ్ లో 42 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ జట్టు విజయం సాధించింది. మ్యాచ్ లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ జట్టులో ఇషాన్ కిషన్ (84: 32 బంతుల్లో 11×4, 4×6), సూర్యకుమార్ యాదవ్ (82: 40 బంతుల్లో 13×4, 3×6) విధ్వంసకరమైన ఇన్నింగ్స్ ఆడటంతో ముంబై ఇండియన్స్ జట్టు 9 వికెట్ల నష్టానికి 235 పరుగుల స్కోర్ చేసింది.
Video Advertisement
236 పరుగుల ఛేదనలో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఓపెనర్లు జేసన్ రాయ్ (34: 21 బంతుల్లో 6×4), అభిషేక్ శర్మ (33: 16 బంతుల్లో 4×4, 1×6) దూకుడుగా ఆడగా, ఈ మ్యాచ్ లో కెప్టెన్ గా వ్యవహరించిన మనీశ్ పాండే (69 నాటౌట్: 41 బంతుల్లో 7×4, 2×6) హాఫ్ సెంచరీ నమోదు చేశారు. మిడిల్ ఆర్డర్ నుంచి ప్రియమ్ గార్గె (29: 21 బంతుల్లో 2×4, 1×6) తప్ప మనీష్ పాండేకి ఎక్కువగా సహకారం లభించలేదు. దాంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు 8 వికెట్ల నష్టానికి 193 పరుగుల స్కోర్ చేసింది. ఈ మ్యాచ్లో హైదరాబాద్ ని 170+ పరుగుల తేడాతో ముంబయి ఓడించి ఉంటే అప్పుడు కోల్‌కతాకి బదులుగా ముంబయి ప్లే ఆఫ్స్ కి అర్హత సాధించేది. ఈ మ్యాచ్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
#16
#17
#18
End of Article