పదివేలతో మొదలుపెట్టి.. కోట్లలో సంపాదిస్తున్నాడు… ఎందరికో ఇన్స్పిరేషన్ గా నిలుస్తున్న ఈ కుర్రాడి రియల్ స్టోరీ..!

పదివేలతో మొదలుపెట్టి.. కోట్లలో సంపాదిస్తున్నాడు… ఎందరికో ఇన్స్పిరేషన్ గా నిలుస్తున్న ఈ కుర్రాడి రియల్ స్టోరీ..!

by Anudeep

Ads

మనం జీవితంలో సెటిల్ అవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉంటాం. చదువు పూర్తి కాగానే ఏదైనా మంచి కంపెనీలో జాబ్ కొట్టేయాలి అని భావిస్తూ ఉంటాం. మంచి సంపాదన వచ్చే ఉద్యోగం ఉంటె లైఫ్ సెటిల్ అయిపోయినట్లే అనుకుంటాం. తీరా, జాబ్ వచ్చాక జీవితం యాంత్రికమైపోయిందని అనిపిస్తుంది. కానీ ప్రతి అవసరానికి జాబ్ పైనే డిపెండ్ అయి ఉంటాం కాబట్టి కమిట్ అయి పని చేస్తాం.

Video Advertisement

praful billor 1

అయితే.. మరికొందరు మాత్రం వ్యాపారమే తమ లక్ష్యంగా పెట్టుకుంటారు. కృషి, పట్టుదలతో వ్యాపారంలో విజయాలు సాధిస్తారు. అయితే.. జాబ్ లైఫ్ తో పోలిస్తే.. వ్యాపారంలో మాత్రం ఎక్కువ ఓర్పు కావాల్సి వస్తుంది. ఈ కుర్రాడు కూడా ఈ కోవ కిందకే వస్తాడు. ఐఐఎం లో ఎంబీఏ చేయాలి అనేది ఈ కుర్రాడి కల. కానీ, అది నెరవేరకపోవడంతో కుంగిపోలేదు. తండ్రిదారిలోనే వ్యాపారం చేయాలనుకున్నాడు.

praful billor 2

ఈ కుర్రాడి పేరు ప్రఫుల్ బిల్లోర్. మధ్య ప్రదేశ్ కు చెందిన వ్యక్తి. ఎంబీఏ చదవాలన్న తన కల తీర్చుకోవడానికి కామన్ అడ్మిషన్ టెస్ట్ కు ప్రిపేర్ అయ్యాడు. దాదాపు మూడేళ్లపాటు అందులో శిక్షణ పొందాడు. అయితే.. టెస్ట్ పాస్ కాకపోవడంతో ఎంబీఏ సీట్ దక్కలేదు. దీనితో.. ఇది విరమించి మరో మార్గం ఎంచుకోవాలనుకున్నాడు. చదువుకోవడానికి కావాలని చెప్పి తన తండ్రి వద్ద నుంచి పదివేల రూపాయలను తీసుకొన్నాడు.

praful billor 3

ఆ డబ్బుతో టీ వ్యాపారాన్ని ప్రారంభించాలనుకున్నాడు. అందుకోసం అవసరమైన సామానులను కొనుక్కున్నాడు. అహ్మదాబాద్ లో ఐఐఎమ్ పక్కనే ఒక MBA చాయ్ వాలా అన్న పేరుతో చిన్న టీ స్టాల్ ను ఏర్పాటు చేసుకున్నాడు. అక్కడికి చదువుకోవడానికి వచ్చే కుర్రాళ్లతో ఇంగ్లీష్ లో మాట్లాడడం, అతని వ్యాపారంకూడా వైవిధ్యంగా ఉండడంతో చాలా మంది అతనితో మాట్లాడుతూ టీ తాగడానికి వచ్చేవారు. ఇంకా ఉద్యోగులను, నిరుద్యోగులను ఆకర్షించే విధంగా కొటేషన్స్ ను తన టీ స్టాల్ లో పెడుతూ ఉండేవాడు.

praful billor 4

దీనితో తక్కువ టైం లోనే లోకల్ గా మంచి పేరు సంపాదించేసుకున్నాడు. అతని టీ స్టాల్ కి డిమాండ్ రావడం మొదలైంది. ఒక్క టీ స్టాల్ తో మొదలయిన అతని వ్యాపారం ప్రస్తుతం దేశవ్యాప్తంగా 22 టీ స్టాల్స్ ను ఏర్పాటు చేసుకునేలా చేసింది. పదివేలతో వ్యాపారం మొదలుపెట్టి.. కోట్లు గడించే స్థాయికి చేరుకున్నాడు. అతని తండ్రి పూజ సామాగ్రి వ్యాపారం చేస్తూ ఉంటారు. కుమారుడిని చూసి ఆయన గర్విస్తారు. పిల్లలు ఏది చేయాలనుకుంటే అది చేసేవిధంగా తల్లితండ్రులు ప్రోత్సాహం ఇవ్వాలంటూ ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు.


End of Article

You may also like