Ads
సోషల్ మీడియా వినియోగం పెరిగిన తర్వాత ప్రతి విషయం వైరల్ గా మారుతుంది. ఒక ఉద్యోగి తన బాస్ తో చేసిన వాట్సాప్ సంభాషణ స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో పెట్టేశాడు. ఇప్పుడు ఈ సంభాషణ కాస్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. అతను చేసిన ఆ సంభాషణకి రకరకాల భిన్నమైన అభిప్రాయాలు నెటిజన్లు నుంచి వెలువడుతున్నాయి.
Video Advertisement
ఇంతకీ అసలు విషయం ఏంటంటే శ్రేయాస్ తన యజమాని చేసిన వాట్సాప్ మెసేజ్ కి ‘హే’ అంటూ రిప్లై ఇవ్వడం స్టార్ట్ చేశాడు.. దానికిగాను ఆ యజమాని హాయ్ శ్రేయస్ మై నేమ్ ఇస్ సందీప్. ఎప్పుడూ నన్ను హే అని బోధించకూడదు. ఎందుకంటే అది నాకు తగిన పదము కాదు.
నీకు కనుక నా పేరు గుర్తు లేకపోతే సింపుల్ హాయ్ అని పెట్టు. నీ కన్నా ఎక్కువ స్థాయి అధికారులతో మాట్లాడినప్పుడు డ్యూడ్, మ్యాన్, హలో, హే వంటి పదాలు మీరు అధికారంగా వాడకూడదు అంటూ యజమాని రిప్లై ఇచ్చాడు. ఇదీ శ్రేయాస్ తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. నెటిజన్లు ఆ యజమాని ఇచ్చిన రిప్లై కి ఒక్కొక్కరు ఒక్కో విధంగా కామెంట్స్ చేస్తూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ఒకరేమో ఎందుకంటే యజమానులు మీరు సంబోధించే పదాలను చిన్నతనంగా భావిస్తారు. మీరు ఇలా అలా సంబోధించకపోవడమే మంచిది అంటూ, మరో కొందరు మీరు ఆయన అన్న పదాలకు బాధపడలేదు. మిమ్మల్ని కింద తరగతి ఉద్యోగిగా భావించినందుకు మీరు బాధపడ్డారు అంటూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
https://www.instagram.com/p/CfyM5WCPyea/
End of Article