Ads
2020 మొదలైనప్పుడు కరోనా అనేది ఒకటి వస్తుంది అని, దాని వల్ల మొత్తం ప్రపంచం ఇబ్బందులకు గురవుతుందని, అన్ని రకాలుగా అంటే ఆరోగ్యపరంగా, ఆర్థికపరంగా ఇలా అన్ని రకాలుగా సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది అని బహుశా ఎవరూ ఊహించలేదేమో. ఆర్థికంగా మాత్రం కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది అనే చెప్పాలి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల కారణంగా చాలా మంది తమ ఉపాధిని కోల్పోయారు.
Video Advertisement
source : ANI
ముంబైలో సుభాన్ అనే ఒక పద్నాలుగేళ్ల అబ్బాయి తన కుటుంబాన్ని పోషించడం కోసం టీ అమ్ముతున్నాడు. తన తల్లి సంపాదన కోవిడ్ కారణంగా ఆగిపోయింది. సుభాన్ తండ్రి 12 సంవత్సరాల క్రితం చనిపోయారు.
source : ANI
తల్లి స్కూల్ బస్ అటెండెంట్ గా చేస్తారు. కానీ ప్రస్తుతం స్కూల్స్ అన్నీ మూసివేయడంతో తన తల్లి సంపాదన ఆగిపోయింది. సుభాన్ సోదరిలు ఆన్లైన్ క్లాసెస్ ద్వారా చదువుకుంటున్నారు. స్కూల్ రీ ఓపెన్ అయిన తర్వాత సుభాన్ కూడా వెళ్ళి తన చదువుని కొనసాగిస్తానని మీడియాతో చెప్పాడు.
source : ANI
దీనిపై సుభాన్ మాట్లాడుతూ ” నా తల్లి ఒక స్కూల్ బస్ అటెండెంట్. కానీ ఇప్పుడు స్కూల్స్ మూతపడ్డాయి. దాంతో మేము ఆర్థికంగా చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నాం.
source : ANI
నేను భేండి బజార్ లో ఉన్న టీ షాప్ లో టీ తయారు చేసి, నాగ్ పాడ, భేండి బజార్ మరియు ఇతర ప్రాంతాలలో విక్రయిస్తున్నాను. నాకు సొంతంగా షాప్ లేదు. నేను రోజుకి 300 నుండి 400 రూపాయలు సంపాదిస్తున్నాను. దాంట్లో కొంత మా అమ్మకు ఇస్తాను, కొంత సేవ్ చేస్తున్నాను” అని చెప్పాడు.
source : ANI
End of Article