Ads
తల్లి కూతుర్ల అనుభవం అనేది ఎంతో అపూర్వమైనది. ఆడబిడ్డకు ఏ చిన్న లోటు జరిగినా ఆ తల్లి తట్టుకోలేక పోతుంది. బిడ్డకు చిన్న దెబ్బ తగిలినా ఆ తల్లి గుండె విలవిల్లాడిపోతుంది. మాతృమూర్తి ప్రేమ అంత గొప్పది. తల్లి ప్రేమకు ఎలాంటి విలువ కట్టలేము.
Video Advertisement
పెళ్లి చేసి అత్తారింటికి పంపించిన తర్వాత కూడా తన బిడ్డ సంతోషంగా ఉండాలని కోరుకుంటుంది తల్లి. కొంతమంది తల్లులు అధిక ప్రేమ వల్ల ఒక్కోసారి ఆ బిడ్డకు లేనిపోని చిక్కులు తెచ్చిపెడుతుంది. ఆ తల్లీ బిడ్డల మధ్య సరైన అనుబంధ అవగాహన ఉండకపోవచ్చు.
ఓ ఆడబిడ్డ కు వివాహం చేసి అత్తవారింటికి పంపించారు. ఆడబిడ్డ అక్కడ అందరితో అన్యోన్యంగా మెలుగుతూ సుఖంగా జీవిస్తుంది. అమ్మ కంటే ఎక్కువ ప్రేమగా అత్తగారిని చూసుకుంటుంది. ఇటీవల కాలంలో అత్తాకోడళ్ల మధ్య అన్యోన్యత చాలా తక్కువ అనేది మనకు తెలిసిన విషయమే. ఇందుకు ఉదాహరణ ఇప్పుడు మనం తెసుకోబోయే కథ
అమ్మ కంటే ఎక్కువగా అత్తగారి మీద ప్రేమ పెంచుకుంది అంటే వాళ్ళిద్దరూ బంధం ఏ విధంగా ఉందో తెలుస్తుంది. అమ్మ మా అత్త గారి ఇంటికి వచ్చినప్పుడు నా గురించి ప్రతి విషయం చెబుతు ఉంటే నాకు కొంచెం భయం వేస్తోంది. పొరపాటున చెప్పకూడని ఏ విషయమైనా చెపుతుందేమో.. అమ్మ చెప్పే విషయాల వల్ల మా అత్తగారు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటారు ఏమో అనిపిస్తుంది. దీని వలన మా అత్తగారికి నాకు ఉన్న మధ్య అనుబంధం దూరం అవుతుందేమో అనిపిస్తుంది. అమ్మ ఇలా చేయడం నాకు నచ్చటం లేదు .
మా అత్తా కోడళ్ళ మధ్య అనుబంధాన్ని ఎలా కాపాడుకోవాలి. అమ్మ వ్యక్తిత్వం గురించి అత్తగారికి క్లియర్ గా చెప్పడం మంచిదా. లేక అత్త గారికి నాకు మధ్య జరుగుతున్న సంభాషణ గురించి అమ్మకి ప్రతి విషయం ఫోన్లో చెప్పకపోవడం మంచిదా.. అమ్మ మా ఇద్దరి మధ్య ఉన్న మంచి సంబంధాన్ని చెడగొట్టడానికి చూస్తుంది అని నాకు అనిపిస్తుంది. మా ఇంటి లోని జరిగే ప్రతి విషయం నుంచి అమ్మని దూరంగా ఉండడమే మంచిది అని నాకు అనిపిస్తుంది. అమ్మని హద్దులో ఉంచడం ద్వారా మా అత్తా కోడలు అనుబంధం దృఢంగా ఉంటుంది అనిపిస్తుంది నాకు.
NOTE: images used in this article are just for representative purpose. But not the actual characters.
End of Article