ఇలాంటి ఫామిలీ నెవెర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్.! దుర్గం చెరువు బ్రిడ్జిపై ఏం చేసారంటే ? (వీడియో)

ఇలాంటి ఫామిలీ నెవెర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్.! దుర్గం చెరువు బ్రిడ్జిపై ఏం చేసారంటే ? (వీడియో)

by Mohana Priya

Ads

రోడ్ రూల్స్ అతిక్రమించి పోలీసులకు దొరకకుండా తప్పించుకోవడం అంత ఈజీ కాదు. అది కూడా మన హైదరాబాద్ పోలీసుల విషయంలో అయితే ఇంపాజిబుల్. పోలీసుల కంటపడకుండా ఉండడానికి మనం తెలివి ఉపయోగిస్తే, పోలీసులు కూడా మన కంటే ఎక్కువ తెలివిగా ఉండి వాళ్ళ నుండి ఎస్కేప్ అవ్వడం అంత ఈజీ కాదు అనేలా చేస్తున్నారు. ఇంక వివరాల్లోకి వెళితే.

Video Advertisement

దుర్గం చెరువు పై నిర్మించిన బ్రిడ్జ్ అందరినీ ఎంతగానో అట్రాక్ట్ చేస్తోంది. దాంతో పర్యాటకులు కూడా బ్రిడ్జ్ చూడడానికి వస్తున్నారు. శుక్రవారం రాత్రి నుండి సోమవారం ఉదయం వరకు అధికారులు వాహనాలను నిషేధించారు. కేవలం పర్యాటకులకు అవకాశం కల్పించారు. అయినా కూడా రద్దీ తగ్గడం లేదు.ట్రాఫిక్ సమస్య వస్తున్నా కూడా ఎంతో మంది తమ వాహనాలను ఆపి ఫోటోలు దిగుతున్నారు. దీంతో బ్రిడ్జ్ దగ్గర పోలీసులు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఇటీవల ఒక కుటుంబం బైక్ పై వచ్చి బ్రిడ్జ్ దగ్గర ఫోటోలు దిగారు. వాహనం నడుపుతున్న అతను తన బైక్ పై ఉన్న నెంబర్ కనిపించకుండా తన భార్య చున్నీ తీసి నెంబర్ ప్లేట్ పై కప్పారు.

ఇదంతా కెమెరాల్లో రికార్డు అవ్వడం చూసి అక్కడి నుండి వెళ్లిపోయారు. సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ ట్విట్టర్ ఎకౌంట్ లో కొంచెం సెన్సాఫ్ హ్యూమర్ జోడించి “అబ్బబ్బబ్బా.. ఇలాంటి ఫ్యామిలీ నెవెర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్..” అనే క్యాప్షన్ తో ఈ వీడియో ని పోస్ట్ చేశారు.

 


End of Article

You may also like