విజయ్ దేవరకొండకి ఒక ఇంటర్ విద్యార్థి తండ్రి లెటర్..! “నాకెందుకో నువ్వు నచ్చవు..!” అంటూ..?

విజయ్ దేవరకొండకి ఒక ఇంటర్ విద్యార్థి తండ్రి లెటర్..! “నాకెందుకో నువ్వు నచ్చవు..!” అంటూ..?

by Mohana Priya

Ads

విజయ్ దేవరకొండ. ఒక సెన్సేషన్ క్రియేట్ చేసిన పేరు. అప్పటి వరకు ఎవరు చేయలేని ఒక సాహసం, అర్జున్ రెడ్డి సినిమాతో విజయ్ దేవరకొండ చేశారు. సైడ్ ఆర్టిస్ట్ గా విజయ్ దేవరకొండ కెరీర్ మొదలు పెట్టారు. తర్వాత హీరోగా సినిమాలు చేశారు. సక్సెస్ రావడం అనేది చిన్న విషయం కాదు. దానికోసం ఎన్నో సంవత్సరాలు ఎదురు చూడాల్సి వస్తుంది. కష్టపడితే సాధించలేనిది ఏదీ లేదు అనడానికి చాలా మంది నిదర్శనంగా నిలిచారు. వారిలో విజయ్ దేవరకొండ కూడా ఒకరు. ఒక సాధారణమైన నేపథ్యం నుండి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.

Video Advertisement

minus points in family star trailer

తర్వాత ఒక్కొక్క అడుగు జాగ్రత్తగా వేసి ఇప్పుడు ఎంతో గుర్తింపు సంపాదించుకున్నారు. అర్జున్ రెడ్డి అనే ఒక్క సినిమా ద్వారా విజయ్ దేవరకొండ భారతదేశ వ్యాప్తంగా ఫేమస్ అయిపోయారు. కానీ ఆ అర్జున్ రెడ్డి సినిమా రావడానికి వెనుక ఎన్నో సంవత్సరాల కష్టం ఉంది. అది ఎవరికి కనిపించదు. అయితే, సాధారణంగా ఎవరైనా ఒకరికి అభిమానులు ఎంత మంది ఉంటారో, అంత మంది కామెంట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. అందులోనూ ముఖ్యంగా యంగ్ హీరోల విషయంలో ఇలా జరుగుతుంది.

a fan father letter to vijay devarakonda

గత కొంత కాలం నుండి విజయ్ దేవరకొండ చేస్తున్న సినిమాలు అన్నీ ఒకే తరహాలో ఉంటున్నాయి. అందుకే విజయ్ దేవరకొండ మీద కామెంట్స్ వస్తున్నాయి. ఆశించిన స్థాయిలో ఫలితాలు కూడా ఆ సినిమాలు పొందట్లేదు. ఇందులో చాలా వరకు పాన్ ఇండియన్ రిలీజ్ అయిన సినిమాలు ఉన్నాయి. దాంతో, విజయ్ దేవరకొండ స్పీచ్ ఒక రకంగా ఉంటే, సినిమా కంటెంట్ ఒక రకంగా ఉంటుంది అంటూ కామెంట్స్ రావడం మొదలు అయ్యాయి. అయితే, విజయ్ దేవరకొండ అభిమానుల్లో చాలా మంది యూత్ వర్గానికి చెందిన వారు ఉంటారు.

a fan father letter to vijay devarakonda

అలా ఒక ఇంటర్ అబ్బాయి కూడా విజయ్ దేవరకొండ అభిమాని. అయితే, ఆ అబ్బాయి తండ్రి విజయ్ దేవరకొండ కి ఒక లెటర్ రాశారు. ముందు తనకి విజయ్ దేవరకొండ అంత పెద్దగా నచ్చేవారు కాదు అని, ఆ తర్వాత విజయ్ దేవరకొండ ఏంటో అర్థం అయ్యారు అంటూ ఈ లెటర్ లో వివరంగా రాశారు. ఈ విషయాన్ని రేవంత్ అనే ఒక అభిమాని సోషల్ మీడియా ద్వారా తనకి వాట్సాప్ గ్రూప్ లో ఈ లెటర్ వచ్చింది అంటూ షేర్ చేశారు. దాంతో ఈ లెటర్ చదివిన వారందరూ కూడా చాలా బాగా రాశారు అంటూ కామెంట్ చేస్తున్నారు.

a fan father letter to vijay devarakonda a fan father letter to vijay devarakonda a fan father letter to vijay devarakonda a fan father letter to vijay devarakonda a fan father letter to vijay devarakonda

ALSO READ : 2018 లో ఈ మాట చెప్పాడు… 6 సంవత్సరాల తర్వాత నిజం చేశాడు..! ఎవరు ఈ ప్లేయర్..?


End of Article

You may also like