“చై – సామ్ విడిపోతే అంత పర్సనల్ గా ఎందుకు ఫీల్ అవుతున్నావు?” అని అడిగితే…ఓ ఫ్యాన్ చెప్పిన 5 కారణాలు ఇవే.!

“చై – సామ్ విడిపోతే అంత పర్సనల్ గా ఎందుకు ఫీల్ అవుతున్నావు?” అని అడిగితే…ఓ ఫ్యాన్ చెప్పిన 5 కారణాలు ఇవే.!

by Mohana Priya

Ads

నాగ చైతన్య, సమంత విడాకుల విషయం చాలా మందిని షాక్ కి గురి చేసింది. వారిని టాలీవుడ్‌లో ఉన్న బెస్ట్ కపుల్స్ లో ఒకరు అని అంటూ ఉంటారు. ఇద్దరూ కలిసి పెళ్లయిన తర్వాత మజిలీ సినిమాలో కూడా నటించారు. ఆ సినిమా ప్రమోషన్స్ టైంలో వాళ్లు మాట్లాడిన విధానం చూసి వారిద్దరికీ క్రేజ్ ఇంకా పెరిగింది. ఇంక సోషల్ మీడియా అకౌంట్ లో అయితే ఇద్దరు కలిసి ఉన్న పిక్చర్ పోస్ట్ అయితే ఆ రోజు మొత్తం అది ట్రెండింగ్ లో ఉండేది. అలాంటిది ఉన్నట్టుండి వాళ్ళు విడాకులు ప్రకటించేటప్పటికి వారి అభిమానులు చాలా బాధపడ్డారు. ఈ బాధలోనే ఒక ఫ్రెండ్ తో మాట్లాడితే అసలు వాళ్ళిద్దరూ విడిపోయిన తర్వాత అందరూ ఎందుకు అంత బాధ పడ్డారో చెప్తూ కొన్ని కారణాలు చెప్పింది. అవేంటంటే.

Video Advertisement

5 reasons behind chaysam divorce

#1 వాళ్ళిద్దరు చూడడానికి మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా ఉంటారు. సెలబ్రిటీ కపుల్స్ లో చాలామందికి వాళ్ళిద్దరు అంటే ఇష్టం. ఇంటర్వ్యూస్, అడ్వర్టైజ్మెంట్స్ లో కూడా వాళ్ల బాండింగ్ ప్రేక్షకులకు చాలా బాగా నచ్చింది.

#2 నాగ చైతన్య మీద ఎలాంటి వివాదాలు లేవు. నాగ చైతన్య చిన్న వయసులో ఉన్నప్పుడే, అతని తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు. పెళ్ళికి, బంధాలకి నాగ చైతన్య చాలా విలువ ఇచ్చే మనిషిలాగా కనిపిస్తారు. అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకుంటారు అని ఎవరూ ఊహించలేదు.

5 reasons behind chaysam divorce

#3 అక్కినేని ఫ్యామిలీకి సంబంధించిన ఎటువంటి పోస్ట్ కి అయినా సమంత కామెంట్స్ ఖచ్చితంగా ఉంటాయి. నాగార్జున ఏదైనా పోస్ట్ చేస్తే అందుకు “మామ” అని సంబోధిస్తూ మరీ సమంత కామెంట్ చేస్తారు. అలాగే వారి కుటుంబంలో ఇంకా ఎవరి సినిమాలకు సంబంధించిన అప్‌డేట్ వచ్చినా కూడా సమంత కామెంట్ ఖచ్చితంగా పెడతారు. దాంతో సమంతకి, అక్కినేని కుటుంబంతో మంచి రిలేషన్ ఉన్నట్టు అనిపిస్తుంది.

5 reasons behind chaysam divorce

 

#4 వీరిద్దరూ ఇప్పుడు కాదు. ఏ మాయ చేసావే సినిమా నుండి స్నేహితులయ్యారు. దాదాపు 7 సంవత్సరాలు ప్రేమించుకున్నారు. అంత లాంగ్ టైం రిలేషన్ షిప్ ఉన్నప్పుడు విడిపోయే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అన్ని సంవత్సరాలు ప్రేమించుకున్నారు కాబట్టి ఎప్పటికీ కలిసి ఉంటారు అని ఫ్యాన్స్ అనుకున్నారు.

5 reasons behind chaysam divorce

#5 విడాకులు ప్రకటించే ముందు వరకు కూడా సమంత, నాగ  చైతన్య సోషల్ మీడియాలో ఒకరినొకరు అభినందించుకోవడం వంటివి చేశారు. నాగ చైతన్య హీరోగా నటించిన లవ్ స్టోరీ సినిమా ట్రైలర్ విడుదల అయినప్పుడు సమంత విషెస్ తెలిపారు. అంతకుముందు కూడా సమంత ముఖ్య పాత్రలో నటించిన ఫ్యామిలీ మాన్ ట్రైలర్ విడుదల అయినప్పుడు నాగ చైతన్య కూడా “ట్రైలర్ చాలా బాగుంది” అని కామెంట్ చేశారు. ఇదంతా చూస్తే వాళ్లు ఒకరినొకరు చాలా గౌరవించుకుంటారు అని అనిపిస్తుంది. అందుకే విడిపోతారు అని అసలు ఊహించలేదు.

ఇదంతా విన్న తర్వాత తను చెప్తున్నది అంతా నిజమేనేమో అనిపించింది.


End of Article

You may also like