8 నెలల ముందు సెక్యూరిటీ గార్డ్ గా పనిచేసిన పదో తరగతి కుర్రాడు.. ఇప్పుడు ఏమయ్యారో తెలిస్తే హాట్స్ ఆఫ్ అంటారు..!

8 నెలల ముందు సెక్యూరిటీ గార్డ్ గా పనిచేసిన పదో తరగతి కుర్రాడు.. ఇప్పుడు ఏమయ్యారో తెలిస్తే హాట్స్ ఆఫ్ అంటారు..!

by Anudeep

Ads

ఇప్పుడు చదువులు ఎంత యాంత్రికం గా మారిపోయాయి మనకు తెలియనిది కాదు. చదవడం మానేసి అందరు బట్టి పట్టడం మొదలు పెట్టారు. బట్టి పట్టి ఎగ్జామ్ పేపర్ లో ఒలకబోస్తే ర్యాంకులు వస్తాయేమో కానీ, ఉద్యోగాలు రావు. అందుకే ఇటీవల నిరుద్యోగం కూడా పెరుగుతోంది. మరో వైపు కంపెనీ లు కూడా కేవలం సర్టిఫికెట్ ల కోసమే కాకుండా.. టాలెంట్ ఉన్న యువత కోసం వెతుకుతున్నాయి.

Video Advertisement

zoho 1

ఈ క్రమం లో సెక్యూరిటీ గార్డ్ గా పని చేసే ఓ పదవ తరగతి కుర్రాడు తన టాలెంట్ తో సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ అయ్యాడు. చదివింది పదవతరగతే అయినా, కుటుంబం లో పరిస్థితుల రీత్యా అతను చదువుకు స్వస్తి పలకాల్సి వచ్చింది. కుటుంబ పోషణ కోసం ఓ సెక్యూరిటీ గార్డ్ గా పని చేయడం ప్రారంభించాడు. వివరాల్లోకెళితే, అబ్ధుల్ అలీమ్​ అనే కుర్రాడు అస్సాం లో ఓ మారుమూల గ్రామం లో నివసించేవాడు. కుటుంబం కోసం ఏదైనా ఉద్యోగం వెతుక్కోవాలని వేయి రూపాయలు తీసుకుని 2003 లో చెన్నై కి వచ్చాడు.

zoho 2

దాదాపు రెండు నెలల పాటు ఎదో ఒక ఉద్యోగం కోసం చాలా కష్ట పడ్డాడు. చివరకు సెక్యూరిటీ గార్డ్ గా చెన్నైలోని జోహో కార్యాలయంలో ఓ ఉద్యోగం దొరికింది. అక్కడే సెక్యూరిటీ గార్డ్ గా పని చేసేవాడు. ఈ క్రమం లో సీనియర్ ఉద్యోగి అలీమ్ ను కంప్యూటర్ గురించి కొన్ని ప్రశ్నలు అడిగాడు. తానూ 10 క్లాస్ మాత్రం చదివానని, హెచ్ టి ఎం ఎల్ గురించి కొంత అవగాహనా ఉందని చెప్పాడు. మరి ఇప్పుడు నేర్పిస్తే నేర్చుకుంటావా..? అని సదరు ఉద్యోగి అడగగా.. అవకాశం ఇస్తే ఏదైనా నేర్చుకుంటానని అలీమ్ చెప్పాడు.

software engineer

అయితే, అప్పటి నుంచి ఆ సీనియర్ ఉద్యోగి అలీమ్ కు అన్నివిధాలా శిక్షణను , సహకారాన్ని అందించాడు. ఓ వైపు సెక్యూరిటీ గార్డ్ గా రోజుకు 12 గంటలు పని చేస్తూ.. మరో వైపు సీనియర్ ఉద్యోగి వద్ద కోడింగ్ ను నేర్చుకున్నాడు. మరికొన్ని సాఫ్ట్ వేర్ టూల్స్ వినియోగాన్ని కూడా తెలుసుకున్నాడు. పూర్తి గా శిక్షణ తీసుకున్నాక అదే కంపెనీ లో అలీమ్ ఇంటర్వ్యూ ను పూర్తి చేసాడు. ఇంటర్వ్యూ క్లియర్ చేసి, సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా జోహో సంస్థ లో ఎంపిక అయ్యాడు.

software coding

దీనిపై, అతను హర్షం వ్యక్తం చేసాడు. తనకు సరైన విద్యార్హత లేకున్నా, నేను పెంచుకున్న పరిజ్ఞానం పై నమ్మకం ఉంచి, నా టాలెంట్ ను గుర్తించి నన్ను ఉద్యోగం లోకి తీసుకున్న జోహో సంస్థ కు అలీమ్ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే, తన ప్రతిభను గుర్తించి ప్రోత్సహించి, శిక్షణను ఇచ్చిన సీనియర్ ఉద్యోగి షిబు అలెక్సిస్ కి కూడా కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం సాఫ్ట్ వేర్ గా ఎనిమిది సంవత్సరాలు ఉద్యోగం లో ఉన్నట్లు చెప్పుకొచ్చాడు. క్లౌడ్ కంప్యూటింగ్, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, వెబ్ డెవలప్​మెంట్​ వంటి విభాగాల్లో జోహో సాఫ్ట్ వేర్ సంస్థ సేవలు అందిస్తోంది. ఉద్యోగి కి కావాల్సింది డిగ్రీలు, సర్టిఫికెట్ లు మాత్రమే కాదని, టాలెంట్ ముఖ్యమని జోహో సంస్థ నిరూపించింది.

https://telugu.news18.com/news/trending/security-guard-became-software-employee-within-8-months-now-completes-eight-years-career-as-techie-hsn-gh-805406.html?fbclid=IwAR2pfKzUgiowCQX3AlCpMc6eQaD_rx8ZKNx_KBhkNNZAFg2WrI0d4Aud1QQ


End of Article

You may also like