సీట్ మార్చమని అడిగిన మహిళకి…ఎయిర్ హోస్టెస్ చెప్పిన సమాధానం హైలైట్.! అసలు ఏమైంది.?

సీట్ మార్చమని అడిగిన మహిళకి…ఎయిర్ హోస్టెస్ చెప్పిన సమాధానం హైలైట్.! అసలు ఏమైంది.?

by Mohana Priya

Ads

సాధారణంగా మనం అందరం ఒక మనిషిని చూడగానే ఒక జడ్జిమెంట్ కి వచ్చేస్తాం. కానీ అలా ఒక మనిషిని చూడగానే వారి గురించి మనం అనుకున్నది నిజం అవ్వాలి అని రూలేమీ లేదు. ఈ కథ వింటే మీకు కూడా ఈ విషయం అర్థమవుతుంది. ఒక ఫ్లైట్ లో ఒక మహిళ కూర్చుని ఉంది. తన పక్కన సీట్ ఖాళీ గా ఉంది. కొంచెం సేపటి తర్వాత ఆ సీట్ భర్తీ అయ్యింది.

Video Advertisement

a lady in a flight story

ఆ మహిళ పక్కనున్న సీట్లోకి ఒక ఆయన వచ్చారు. ఆయనకి చేతులు లేవు. దాంతో ఆ మహిళ ఆయనని పై నుంచి కిందకి ఒకసారి చూసి తల తిప్పేసుకుంది. ఆయన ఆ మహిళని పలకరించడానికి ప్రయత్నించినా కూడా, ఆయన వైపు చూడకుండా విండో వైపు చూస్తూ కూర్చుంది మహిళ. ఆ పురుషుడు కూడా తర్వాత మళ్ళీ ఏమీ మాట్లాడలేదు.

a lady in a flight story

అయితే కొంచెం సేపటికి ఆ మహిళ ఎయిర్ హోస్టెస్ ని పిలిచి తనకి ఇబ్బందిగా ఉంది అని సీట్ మార్చమని కొంచెం గట్టిగా అడిగింది. ఆ మహిళ సీట్ మార్చమని ఎందుకు అడిగిందో ఎయిర్ హోస్టెస్ కి అర్థం అయ్యింది. అప్పుడు తను నవ్వుతూ “షూర్ మ్యాడమ్” అని ఆ మహిళకు జవాబు ఇచ్చి వెళ్ళిపోయింది.

a lady in a flight story

వెళ్ళిపోయిన ఒక పది నిమిషాల తర్వాత ఆ ఎయిర్ హోస్టెస్ మళ్ళీ ఆ మహిళ దగ్గరికి వెళ్ళింది. ఆ మహిళ పక్కనున్న పురుషుడిని చూసి “సారీ సర్. మీరు ఆర్మీలో ఎన్నో సంవత్సరాలు పని చేశారు. మీలాంటి గొప్ప వ్యక్తిని ఇలాంటి ఆలోచనా విధానం ఉన్న వాళ్ల పక్కన కూర్చోపెట్టినందుకు క్షమించండి. మీకు మరొక సీట్ ఏర్పాటు చేస్తాము” అని  చెప్పి వెళ్ళిపోయింది.

a lady in a flight story

ఆ తర్వాత అనవసరంగా అంత గొప్ప వ్యక్తి గురించి తెలుసుకోకుండా, ఒక జడ్జిమెంట్ కి వచ్చినందుకు ఆ మహిళ కూడా ఆ పురుషుడిని క్షమించమని అడిగింది. ఒక మనిషిని చూసిన వెంటనే ఒక జడ్జిమెంట్ కి రాకూడదు అనే దానికి ఇది ఒక ఉదాహరణ అని పాటికి అందరికీ అర్థమయ్యే ఉంటుంది.


End of Article

You may also like