డబ్బు లేదని అతన్ని రిజెక్ట్ చేసింది..12 సంవత్సరాల తర్వాత భర్తతో ఉండగా అతను ఎదురైనప్పుడు ఏమైందంటే.?

డబ్బు లేదని అతన్ని రిజెక్ట్ చేసింది..12 సంవత్సరాల తర్వాత భర్తతో ఉండగా అతను ఎదురైనప్పుడు ఏమైందంటే.?

by Mohana Priya

Ads

మనం ఇవాళ పరిస్థితిని చూసి మన భవిష్యత్తు ఎలా ఉంటుందో అనే విషయాన్ని నిర్ణయించకూడదు. అంటే ఒకవేళ ఇవాళ మన దగ్గర కేవలం పది రూపాయలు మాత్రమే ఉంటే, రేపు కూడా మన దగ్గర పది రూపాయలు మాత్రమే ఉంటాయి అని అనుకోకూడదు.

Video Advertisement

పరిస్థితులు మారి రేపు వందలు, వేలు, లక్షలు, కోట్లు కూడా కావచ్చు. ఈ కథ చదివితే ఒక మనిషి భవిష్యత్తుపై వాళ్ళ ఇవాల్టి పరిస్థితిని చూసి ఒక అంచనాకు రావడం ఎంత తప్పు అనేది అర్థమవుతుంది.

ఒక అబ్బాయి కాలేజీలో చదువుతున్న సమయంలో తన క్లాస్ మేట్ అయిన ఒక అమ్మాయిని ప్రేమించాడు. ముందు ఈ విషయం ఆ అమ్మాయికి చెప్పడానికి భయపడ్డాడు. తర్వాత ధైర్యం చేసి ఫైనల్ ఇయర్ లో ఉన్నప్పుడు ఆ అమ్మాయితో ఈ విషయం చెప్పేశాడు. ఈ విషయం విన్న తర్వాత ఆ అమ్మాయి, ఆ అబ్బాయి ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేదు అనే కారణంతో రిజెక్ట్ చేసింది. తర్వాత కాలేజ్ అయిపోయింది. ఎవరి దారిన వాళ్లు వెళ్లిపోయారు. ఒకరితో ఒకరికి కాంటాక్ట్ కూడా లేదు.

12 సంవత్సరాల తర్వాత ఒకరోజు ఒక షాపింగ్ మాల్ లో ఆ అమ్మాయి షాపింగ్ చేస్తోంది. అంతలో అటు వైపు నుంచి వెళ్తున్న వ్యక్తి తనకు తెలిసినట్టుగా అనిపించింది. 12 సంవత్సరాల క్రితం తనకు ప్రపోజ్ చేసిన తన క్లాస్ మేట్ అతనే అని గుర్తుతెచ్చుకున్న ఆ అమ్మాయి వెళుతున్న వ్యక్తిని పిలిచింది. ఆ వ్యక్తి వెనక్కి తిరిగి చూశాడు. అమ్మాయి వెళ్లి వ్యక్తిని పలకరించి, “ఉద్యోగం ఏమైనా చేస్తున్నావా? ఇంకా అలానే ఉన్నావా?” అని వెటకారంగా అడిగింది. అందుకు ఆ వ్యక్తి నవ్వి, “నువ్వేం చేస్తున్నావు?” అని అడిగాడు.

అందుకు ఆ అమ్మాయి “ఒక సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాను. నాకు పెళ్లయింది. నా భర్త కూడా ఒక పెద్ద కంపెనీలో ఒక పెద్ద పొజిషన్లో ఉన్నాడు” అని చెప్పింది. అంతలోపు తన భర్త వచ్చాడు. “ఇక్కడ ఏం చేస్తున్నావు?” అని అమ్మాయిని అడిగాడు. దానికి ఆ అమ్మాయి జవాబు ఇచ్చేలోపే అవతలివైపు ఉన్న వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయాడు. “మీరేంటి ఇక్కడ?” అని ఆశ్చర్యంగా అడిగాడు. అందుకు ఆ అమ్మాయి ” ఇతను నీకు తెలుసా?” అని అడిగింది.

అప్పుడు తన భర్త “తెలుసు. ఈయన చాలా పెద్ద వ్యాపారవేత్త. ఇండియాలో చాలా చోట్ల ఈయన కంపెనీ బ్రాంచెస్ ఉన్నాయి. ఈయన స్పీచెస్ యూట్యూబ్ లో చాలాసార్లు చూశాను. మా బాస్ కూడా ఈయనని చాలా అభిమానిస్తారు. ఎంతో మందిని ఇన్స్పైర్ చేశారు. ఒక రకంగా చెప్పాలంటే నేను కూడా చాలా సార్లు ఈయన మాటలు విని ఇన్స్పైర్ అవుతూ ఉంటాను” అని అన్నాడు. ఈ మాటలన్నీ విన్న ఆ వ్యక్తి  “థాంక్యూ” అని చెప్పాడు.

అందుకు అమ్మాయి వాళ్ళ భర్త ” గ్లాడ్ టు మీట్ యు సర్” అని చెప్పాడు. ఆ వ్యక్తి “బై” అని చెప్పి వెళ్ళిపోయాడు. బహుశా అమ్మాయిని ప్రపోజ్ చేసినప్పుడు ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేదేమో, కానీ తర్వాత మారింది. ఇలా ఎదుటి వ్యక్తి పై ఒక అంచనాకు రావడం ఈ ఒక్క సందర్భంలో మాత్రమే కాదు, ఇలాంటివి ఇంకా చాలా మందికి చాలా సందర్భాల్లో ఎదురవుతూనే ఉంటాయి. పరిస్థితులు మారుతాయని, ఒక మనిషి ఇవాళ ఉన్న పరిస్థితిని చూసి భవిష్యత్తు ఎలా ఉంటుందో నిర్ణయానికి రాకూడదు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. అంతే.

NOTE: images used are for representative purpose only. but not the actual characters


End of Article

You may also like