కోరా లో ఏ ప్రశ్న కి అయినా సరే సమాధానం దొరుకుతుంది. ఒక ప్రశ్న కి ప్రపంచం మొత్తంలో ఎక్కడి నుంచైనా జవాబు వస్తుంది అంటే అది కోరా ఏ. చాలా మంది ప్రశ్న గురించి వారి జవాబు ని ఇస్తూ వుంటారు. అలానే పెళ్లి చూపులు అంటే మనకి గుర్తు వచ్చేది పెళ్లి చూపులు లో వేసే ప్రశ్నలే. పెళ్లి చూపులలో అమ్మాయి, అబ్బాయి ఒకరిని ఒకరు కొన్ని ప్రశ్నలు అడిగి వాటి నుండి పెళ్లి చేసుకోవాలా? లేదా? అనేది ఆలోచిస్తారు.

Video Advertisement

అమ్మాయి, అబ్బాయి వీటిని బట్టి లైఫ్ లాంగ్ కలిసి ఉండాలా లేదా అనేది డిసైడ్ అవుతారు. ”పెళ్లి మాటల్లో (లేక పెళ్ళి చూపుల్లో) ఏదైనా సంబంధం వారు మాట్లాడిన అత్యంత విచిత్రమైన విషయం ఏమిటి?” అని ఒకరు అడగగా..

ఓ కోరా యూజర్ దానికి సమాధానం ఇలా ఇచ్చారు. ఈ ప్రశ్నలు, జవాబులు చాలా వెరైటీగా వున్నాయి మరి మీరూ చూసేయండి. అమ్మాయి తల్లి అబ్బాయి తండ్రిని ఇలా అడగడం స్టార్ట్ చేసింది.

#1. మీరు ఏం చేస్తారు ?

రెవెన్యూ ఇన్స్పెక్టర్ అని అన్నారు.

#2. ఎప్పుడు రిటైర్ అవుతారు?

వచ్చే ఏడాది అని చెప్పారు.

#3. ఇల్లు మీ సొంతమే కదా. రిటైర్ అయ్యాకా ఆ ఇంట్లోనే ఉంటారా?

లేదండీ. అబ్బాయి దగ్గర ఉంటాం అన్నారు.

#4. అలాగైతే మా అమ్మాయితో మాట్లాడాలి. అయినా చక్కటి ఇల్లు ఉండగా, మళ్లీ అబ్బాయి ఇంటికెందుకండీ.

అంతే.. ఆవిడ కూతుర్ని సంప్రదించడానికి లోపలికి వెళ్ళింది.

#5. ” అత్త మామ మీతోనే ఉంటారట. నీకిష్టమేనా? “

” వద్దు అమ్మా. వాళ్ళు రానంటే ఈ సంబంధం నాకిష్టమే. ” అని అన్నారు.

#6. ” అయినా వాళ్ళెంతకాలం బతుకుతారు. ఆలోచించు. “

ఈ మాటలు హాల్లో అందరికీ వినపడ్డాయి. ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని వెళ్లిపోయారు.

ఇలా మారిపోయాయి ఈ కాలం లో పెళ్లి చూపులు. ఇది వరకు అయితే అబ్బాయి బాగున్నాడా, సంపాదిస్తున్నాడా.. అమ్మాయి ఎలా వుంది అన్ని పనులు వచ్చా అని..

sourced from : Quora (Venkata Ramana Surampudi)