పిల్లల ఆన్లైన్ క్లాస్ కోసం “ఆవుని” అమ్మేసారు…చివరికి ఏమైందంటే?

పిల్లల ఆన్లైన్ క్లాస్ కోసం “ఆవుని” అమ్మేసారు…చివరికి ఏమైందంటే?

by Mohana Priya

Ads

కరోనా వైరస్ కారణంగా పెద్ద పెద్ద కంపెనీలు మాత్రమే కాదు చిన్న వ్యాపారులు కూడా ఎంతో నష్టపోతున్నారు. పాఠశాలలు కూడా మూసివేయడంతో విద్యార్థులకు ఆన్లైన్లో తరగతులు నిర్వహిస్తున్నారు. అందరి దగ్గర ల్యాప్టాప్, ఇంటర్నెట్ వంటి సౌకర్యాలు ఉండవు. దాంతో తమ పిల్లలకు చదువును అందించడానికి తల్లిదండ్రులు ఎంతగానో కష్టపడుతున్నారు. వివరాల్లోకి వెళితే.

Video Advertisement

హిమాచల్ ప్రదేశ్ లోని కాంగ్రా జిల్లాలోని జ్వాలముఖికి చెందిన కుల్దీప్ కుమార్ అనే వ్యక్తి 4వ తరగతి 2వ తరగతి చదువుకుంటున్న తన పిల్లలు ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అవ్వడానికి సదుపాయాలు లేక తన కుటుంబ జీవనాధారం అయిన ఆవుని అమ్మేసి తన పిల్లల కోసం ఒక స్మార్ట్ ఫోన్ కొన్నాడు.

ముందు ఆన్లైన్ తరగతుల గురించి తన పిల్లల పాఠశాల యాజమాన్యం చెప్పగానే వాళ్ల దగ్గరికి వెళ్లి తన దగ్గర ఆన్లైన్ క్లాసులు ఏర్పాటు చేయించడానికి లాప్టాప్ కానీ స్మార్ట్ ఫోన్ కానీ లేదు అని చెప్పాడు. స్కూల్ యాజమాన్యం అతనికి ఏ రకంగా సహాయం చేయలేక పోయారు.

ఖచ్చితంగా ఏదో ఒక సదుపాయం ఉండాలి అని ఇప్పుడున్న పరిస్థితిలో ఆన్లైన్లో తప్ప మామూలుగా తరగతులు నిర్వహించడం కుదరదు అని చెప్పారు. దాంతో అతను బ్యాంకు కి వెళ్లి లోన్ అడిగాడు. బ్యాంకు వాళ్లు కూడా అతనికి లోన్ ఇవ్వలేము అని అనడంతో ఏం చేయాలో తెలియక తన ఆవుని అమ్మేసి  దాంతో వచ్చిన ఆరు వేల తో స్మార్ట్ ఫోన్ కొన్నాడు.

 

ఈ కథనాన్ని న్యూస్ పేపర్ లో ప్రచురించారు. అలా ప్రచురించిన ఆర్టికల్ ని సోను సూద్ ట్విట్టర్ లో చూసి వాళ్ళకి సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. అంతేకాకుండా జ్వాలాముఖి ఎమ్మెల్యే రమేష్ ధావాలా కూడా కుల్దీప్ కుటుంబానికి సహాయం అందించాలని బిడిఓ, ఎస్‌డిఎమ్‌లను ఆదేశించామని ప్రకటించారు.


End of Article

You may also like