“నా వల్లే నీ జీవితం నాశనం అయ్యిందా..? ఇందులో నేను చేసిన తప్పేంటి..?” అంటూ… ఒక అమ్మాయి పంపిన మెసేజ్..!

“నా వల్లే నీ జీవితం నాశనం అయ్యిందా..? ఇందులో నేను చేసిన తప్పేంటి..?” అంటూ… ఒక అమ్మాయి పంపిన మెసేజ్..!

by Anudeep

Ads

నాపేరు శ్రావ్య. డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. మాది వరంగల్ జిల్లా పక్కన ఓ చిన్న పల్లెటూరు. నేను, అమ్మానాన్న, ఓ చెల్లి.. చిన్న కుటుంబం మాది. మా నాన్న మమ్మల్ని పూర్తి స్వేచ్ఛతో పెంచాడు. మా ఊరిలో టెన్త్ అవగానే ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు చేసి అత్తారింటికి పంపేవారు కానీ మా నాన్న మాత్రం నన్ను ఇంకా చదివిస్తున్నారు.

Video Advertisement

మమ్మల్ని అందరి అడపిల్లల్లా వంటింటికే పరిమితం చేయకుండా అన్ని విషయాల్లో నాకు, చెల్లికి పూర్తి స్వేచ్ఛను ఇచ్చాడు. నేను రోజు కాలేజ్ కి బస్సులో వెళ్ళి వస్తాను. అయితే ఒకరోజు బస్సులో చాలామంది ఎక్కడంతో సీట్లు ఖాళీగా లేవు. అప్పుడే ఓ 60 ఏళ్ల పండు వృద్ధురాలు ఎక్కింది.

అటూ ఇటూ చూసింది ఎక్కడా సీట్లు లేకపోవడంతో కష్టంగా ఉన్నా.. అలాగే నిల్చునే ప్రయత్నం చేస్తోంది. అప్పుడే ఓ కుర్రాడు లేచి మామ్మ ఇక్కడ కూర్చోండి అంటూ తన సీటు ఇచ్చాడు. అతని మంచి మనసు, పెద్దల పట్ల చూపిన గౌరవానికి నేను ఫిదా అయిపోయాను. బస్సు దిగాక నేనే పలకరించి తను చేసిన పనికి అభినందించాను.
అతని వివరాలు అడగగా తన పేరు రాజేష్ అని, బీఏ చదువుతున్నాడని, మా ఊరి పక్కనే వాళ్ళ ఊరు అని చెప్పాడు.

అప్పటి నుంచి తను నేను ఎప్పుడు కనిపించినా పలకరించే వాడు. అలా మా మధ్య స్నేహం ఏర్పడింది. తరువాత కొన్ని రోజులకు ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి అని తననుంచి మెసేజ్ రావడంతో వెళ్లి కలిశాను. సంకోచిస్తూనే తన మనసులోని మాట చెప్పాడు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వు లేకుండా బతకలేను అంటూ ఏడ్చేశాడు. అప్పటికే తనంటే నాకు మంచి అభిప్రాయం ఉండడంతో ఓకే అన్నాను. చదువు పూర్తయ్యాక పెళ్లి చేసుకుందాం అనుకున్నాం.

చివరకు ఆ రోజు రానే వచ్చింది. ఇంట్లో వాళ్ళను ఒప్పించి పెళ్లి చేసుకుందాం అంటే.. తను వద్దన్నాడు మనం ఇంకా సెటిల్ అవ్వలేదు మన ఇళ్లల్లో ఇప్పుడే ఒప్పుకోరు మనం ఎక్కడికైనా వెళ్ళిపోయి గుళ్లో పెళ్లి చేసుకుందాం అన్నాడు. అన్నీ అనుకున్నట్టే జరిగితే.. ఈ రోజు నేను నా గురించి చెప్పడానికి మీ ముందుకు వచ్చేదాన్ని కాదు. మేము గుళ్లో పెళ్లి చేసుకొని హైదరాబాద్ లో ఓ చిన్న రూమ్ తీసుకొని ఉండేవాళ్ళం.

పెళ్లయ్యాక నేను ఓ షాప్ లో పని చేయడం ప్రారంభించాను. రాజేష్ మాత్రం ఏ పని చేసే వాడు కాదు పైగా నా సంపాదననే తాగుడుకు వాడే వాడు. నావల్లే తన జీవితం నాశనమయ్యిందని నానా బూతులు తిట్టే వాడు. కొన్నాళ్ళకు నేను గర్భవతిని అవ్వడంతో జాబ్ చేయడం మానేసాను. ఉన్న చిన్నపాటి పొదుపు కూడా కరిగిపోయింది. అప్పటికే తనకు ఎన్నోసార్లు చెప్పి చూసాను ఏదైనా జాబ్ చూసుకో ఇళ్లు గడవడం కష్టం అని.. అయినా తన తీరు మారలేదు.

ఒక్కోరోజు గతం గుర్తొచ్చి బాగా ఏడ్చేడాన్ని. ప్రేమలో ఉన్నప్పుడు ఎన్ని మాటలు చెప్పాడో.. నిన్ను అలా చూసుకుంటాను, ఇలా చూసుకుంటాను. కాలు బయట పెట్టనివ్వను, నువ్వే నా యువరాణివి అంటూ.. ఇప్పుడు కడుపుతో ఉన్నా పస్తులు ఉండాల్సి వస్తుంది. యువరాణి మాట దేవుడెరుగు అత్యంత హీనస్థితికి తీసుకొచ్చాడు. ఎంతకూ తన తీరు మారదు అని అర్థమయ్యాక రూమ్ నుంచి బయటకొచ్చి వర్కింగ్ విమెన్ హాస్టల్ లో ఉంటూ రోజులు గడుపుతున్నాను.

తిరిగి ఇంటికి వెళ్లడానికి మనస్సు అంగీకరించడం లేదు. ఒక్కో రోజు చెల్లి,అమ్మా నాన్న బాగా  గుర్తొస్తుండేవారు. ఎలా ఉన్నారో, ఏం చేస్తున్నారో అని. ఈ మధ్యే మా ఊరి నుంచి ఉద్యోగానికని వచ్చిన స్వప్న నాకు భయంకరమైన విషయాలు చెప్పింది. నేను ఇంట్లో నుంచి బయటకు వచ్చాక నాన్న పేరాలసిస్ తో మంచానికే పరిమితం అయ్యాడని, ఎప్పుడు ఇల్లు దాటాని అమ్మ ఇప్పుడు కుటుంబ పోషణకు పొలం పనులకు వెళ్తుందని, చెల్లి చదువు మానేసి ఇంటికే పరిమితం అయ్యిందని చెప్పింది.

ఇదంతా విన్నాక నా నోట మాట రాలేదు. కన్నీళ్లు ఎప్పుడు ఆగిపోయాయో గుర్తే లేదు. సో ఫ్రెండ్స్ మనం అనాలోచితంగా తీసుకునే నిర్ణయాల వల్ల మన జీవితమే కాదు మన కుటుంబం మొత్తం రోడ్డున పడుతుందని గుర్తించుకోండి. ప్రేమ ఓ వరమే కానీ అది మన కుటుంబానికి శాపంగా మారకుండా చూడాల్సిన బాధ్యత మనదే.


End of Article

You may also like