Ads
ప్రస్తుతం మన విద్యావ్యవస్థ మనకి బతకడం నేర్పదు. మనకి జ్ఞానాన్ని ఇస్తుంది. కానీ.. దానిని నిజజీవితంలో ఎలా ఉపయోగించుకోవాలి అనే విషయాన్ని చెప్పదు. అందుకే ప్రస్తుతం చదువుకునే విద్యార్థులంతా కష్టపడి చదువు పూర్తి చేసి క్యాంపస్ లోనే మంచి జాబ్ ని కొట్టాలి అనే ఆలోచనలో ఉంటారు.
Video Advertisement
ఈ క్రమంలో తక్కువ శాలరీకి మొదట్లో జాబ్ జాయిన్ అయినా మెల్లమెల్లగా పైకి ఎదిగి మంచి జీతం తెచ్చుకుంటారు. ఇంట్లోవాళ్ళు కూడా పిల్లాడు చేతికొచ్చాడు అనుకుంటూ.. పెళ్లి చేస్తారు. అప్పుడు మొదలవుతాయి అసలు కష్టాలు.
లెక్కకు మించిన ఖర్చులు, ఊహించని అవసరాలతో నలభై వేల జీతం ఉన్నా నాలుగు రోజుల్లో ఆవిరైపోయే పరిస్థితులు వచ్చేస్తాయి. చాలా మంది మధ్యతరగతి కుటుంబాలలో జరిగే అవస్థే ఇది. అలా.. నలభై వేలు సంపాదించుకునే ఓ మధ్య తరగతి అబ్బాయి తన జీవితంలో ఉన్న ఫ్రస్ట్రేషన్ ను ఇలా పంచుకున్నాడు.
నాకు నెలకి నలభై వేల జీతం వచ్చినా.. చివరకి బజాజ్ ఈ ఎం ఐ లు తప్ప ఏమి మిగలలేదు. ఇంటి అద్దె 6000, పాలు. 1800 1లీ 60 రూ, కరెంట్ బిల్. 1000, రైస్ 50 kg x50rs 2500, కూరగాయలు 1000, ఆయిల్..వగేరా. 3000 , సండే చికెన్. 4వాx200. 800, కార్ లేక బైక్ పెట్రోల్.3000- 5000, పిల్లల ఫీజు. 2000×2 నెలకి (LKG కూడా 20వేలు కాబట్టి ఒక్కడికి), (నాకు ఇద్దరు పిల్లలు కాబట్టి నెలకు 4000 వేలు) కనీసం ఖర్చులు అవుతాయి. ఇవి కాకుండా.. పిల్లలకు ఆసుపత్రి ఫీజులు మరో 2000 అవుతాయి..
నలభై వేలు జీతం అంటే గవర్నమెంట్ ఆరోగ్య శ్రీని ఇవ్వదు. కాబట్టి ఇన్సూరెన్స్ ను నేనే కట్టుకోవాలి. నెలకు 4లుగురికి 4000 వేలు అవుతుంది. ఇప్పటికే 30 వేలు అయి0ది.. నెలకు మినిమం ఖర్చు….ఇక పండగలు పెళ్లిళ్లు/ బర్త్ డే లకి అమ్మవాళ్ల ఊరు, అత్తగారి ఊరు వెళ్ళడానికి అయ్యే ఖర్చులు చాలానే ఉంటాయి. ఇవి కాక.. నలభై వేల జీతం వస్తోందని భార్య వచ్చి మంచి ఫోన్ కొను, ఏసీ కొను, ఫ్రిడ్జ్ కొను, వాషింగ్ మెషీన్ కొను.. సోఫా కొను..,గోల్డ్ కొను.., బొక్క కొను..భూషణం కొను అంటే ఎక్కడ నుంచి వస్తాయి..?
నలభై వేల జీతం ఏమి చేస్తున్నావ్ అంటారు.. సరే ఏదైనా కొందాం అని లోన్ కోసం బ్యాంకు కు వెళితే.. టాక్స్ రిటర్న్స్ కట్టిన కాగితాలు తీసుకురా అంటారు. అసలు ఏమి మిగిలింది అని టాక్స్ కడతాం..? ఫ్రెండ్స్ ని అడగాలి అనుకున్నా…. వారి పరిస్థితి కూడా ఇంచుమించు ఇంతే. పోనీ బజాజ్ లో EMI లోకొంటె నెల నెలా వారి ఫోన్ లతో తలనొప్పి. ఒక్క నెల జీతం ఆలస్యంగా పడితే.. వీరికి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి.
40వేల జీతంతో మేము స్థలం కొనలేము. కానీ మాకు ప్రభుత్వం ఏ స్థలాలను ఇవ్వదు. డబుల్-బెడ్-రూమ్ ఇల్లుని నేను కొనలేను. జీతం వస్తోందిగా అని ప్రభుత్వం కూడా నాకు ఏమి ఇవ్వదు. నలభై వేల జీతం వచ్చినా నాకంటూ మిగిలేది ఏమి ఉండదు. పైగా.. జాబ్ మానేసి ఇంట్లో ఖాళి గా ఉంటె మాత్రం ఇవ్వన్నీ వస్తాయి. విచిత్రం ఏంటంటే.. చిన్నప్పటి నుంచి గవర్నమెంట్ స్కూల్ లోనే చదువుకుని, గవర్నమెంట్ హాస్పిటల్ లోనే ఫ్రీ గా ట్రీట్మెంట్ పొంది.. ప్రస్తుతం విదేశాలు వెళ్ళిపోయి జాబ్ చేసుకునేవారికి మాత్రం ఇవన్నీ దొరుకుతున్నాయి. ఇది మన భారత దేశంలో ఉన్న మధ్యతరగతి బతుకుల పరిస్థితి.
End of Article