Ads
భార్య.. భర్త కోసం సొంత కుటుంబాన్ని సైతం పక్కన పెట్టి ఏడడుగులు నడిచి వస్తుంది. మనతో పాటు జీవితాంతం ఉంటుంది. అలాంటి భార్యని..ఎక్కడకి పోతుంది లే అని నిర్లక్ష్యం చేసే భర్తలు చాలా మందే ఉన్నారు. కానీ ఆ భార్యల మనసులో ఏమి ఉంటుందో ఎవరు ఆలోచించారు. అలాంటి ఓ భార్య.. తానూ అత్తగారు అయినా తరువాత తన కొడుక్కి ఓ ఉత్తరం ద్వారా ఎలాంటి పాఠం నేర్పించిందో ఈ ఆర్టికల్ లో చూద్దాం.
Video Advertisement
ఓ హోటల్ లో భార్య, భర్త, పిల్లలు డిన్నర్ చేస్తుండగా.. ఆ భర్తని భార్య ఇలా అడుగుతుంది. “ఏమండి మీరు చాలా బిజీ గా ఉంటారు. అలాంటిది.. సడన్ గా మీలో ఈ మార్పు ఎలా వచ్చింది..? వారానికోసారి మమ్మల్ని బయటకు తీసుకెళ్తున్నారు. మాతో సరదాగా గడుపుతున్నారు.. మాకు తెలీకుండా, అనుమానం రాకుండా రెండో ఇల్లు ఏమైనా పెట్టారా ఏంటి..??? ” అని అడుగుతుంది. దానికి చిరునవ్వి నవ్వినా ఆ భర్త.. చనిపోయిన తన తల్లి రాసి ఇచ్చిన లేఖ ను భార్య చేతిలో పెట్టి కన్నీళ్లు పెట్టుకుంటాడు.
ఇంతకీ ఆ లేఖ లో ఏమి ఉందంటే… ఆ లేఖ ను ఆ భర్త తల్లి రాసింది. ” చిన్నా.. ఈ లేఖ నువ్వు చదివేసరికి నేను బతికుంటానో లేదో తెలియదు.. కానీ మీ నాన్న కు నేను చెప్పలేకపోయిన విషయాలను, నీ భార్య నీతో చెప్పలేకపోతున్న విషయాలను.. నేను చనిపోయేలోపు నీతో పంచుకోవాలనుకుంటున్నాను.
నాకు పెళ్లి అయిన తరువాత నా భర్త కూడా నీలానే బిజీ గా ఉండేవాడు. డబ్బు సంపాదన లో పడి ఇంటిని కూడా మర్చిపోయేవాడు. అప్పుడు నాకు మీరే లోకం.పిల్లలే సర్వస్వము అనుకుని బతికేసాను. మీరు పుట్టకముందు మీ నాన్న కోసం… మీరు పుట్టి స్కూల్స్ కి వెళ్తున్నపుడు, ఎప్పుడు ఇంటికి వస్తారా అని మీకోసం ఎదురు చూస్తూ గడిపేశాను…
మీరు పెద్దవాళ్లయ్యి మీ జీవితాలు మీరు గడిపేస్తారు. ఉన్న ఒక్క ఆడపిల్ల కి పెళ్లి చేసి విదేశాలకు పంపేసాము. ఆమెకు కాపురం తోనే సరిపోతుంది. ఎప్పుడో ఒకసారి పది నిముషాలు ఫోన్ చేస్తుంది. ఆ ఫోన్ కోసం పడిగాపులు గతిస్తుంటాను. మీ నాన్న అప్ప చెప్పిన వ్యాపారం లో నువ్వు కూడా బిజీ అయ్యావు. నువ్వెప్పుడు ఇంటికి వస్తావో.. నాతొ కాసేపు మాట్లాడుతావో అని ఇప్పడూ ఎదురు చూస్తూనే ఉన్నాను. ఇక మీ నాన్న.. మందులకు, భోజనానికి తప్ప నాతొ మాట్లాడేది ఏమి ఉండదు. ఆయనకు పేపర్ చదవడం పై ఉన్న ఆసక్తి నాతో మాట్లాడడం పై ఉండదు. వయసులో ఉన్నప్పుడు లేనిది..ఇప్పుడు రమ్మంటే ఎలా వస్తుంది..?
నా జీవితమంతా ఎదురు చూపుల్తొనే గడిచిపోయింది. ఇదే పరిస్థితి నీ భార్యకి రాకూడదని కోరుకుంటున్నా.. అందుకే ఇప్పటి వరకు మనసు విప్పి పంచుకొని విషయాలను ఇప్పుడు పంచుకుంటున్నా.. అపార్ధం చేసుకోకుండా.. అర్ధం చేసుకుంటావని ఆశిస్తున్నా..
నీ భార్యతో సమయం గడుపు.. నా కోడలు, మనవడు, మనవరాలిని జాగ్రత్తగా చూసుకో చిన్నా..” అని ఆ లేఖ లో రాసి ఉంది. ఆ లేఖ ను చదివిన భార్య కళ్ళ లోంచి చిన్న గా కన్నీరు కారుతుండడం తో.. భర్త భుజం పై వాలింది. అతను అనునయం గా ఆమె పై చేయి వేసి తన తండ్రి చేసిన తప్పుని తానూ చేయకూడదని నిర్ణయించుకున్నాడు.
End of Article