ఈతరంలో కోడళ్ళు ఇంటి పనులు చేయడానికి ఎందుకు ఇష్ట పడట్లేదు..? అన్న ప్రశ్నకి ఈ అమ్మాయి చెప్పిన సమాధానం చూస్తే షాక్

ఈతరంలో కోడళ్ళు ఇంటి పనులు చేయడానికి ఎందుకు ఇష్ట పడట్లేదు..? అన్న ప్రశ్నకి ఈ అమ్మాయి చెప్పిన సమాధానం చూస్తే షాక్

by Mohana Priya

మనం పూర్వ కాలంలో చూసుకున్నట్లయితే ఆడవాళ్లు బయట పనులు చేసేవారు కాదు. కేవలం ఇంట్లోనే ఇంటి పనులు చేసుకుంటూ ఉండే వారు. రోజంతా కూడా వంట పనులు చేసుకోవడం మొదలు ఎన్నో పనులు అప్పట్లో ఆడవాళ్లు చేసుకునే వారు. అయితే ఈ కాలంలో అమ్మాయిలు ఉద్యోగం చేస్తున్నారు.

Video Advertisement

ఉద్యోగం చేయడం నిజంగా గొప్ప విషయం. పూర్వ కాలంలో అమ్మాయిలు పెద్దగా చదువుకునే వారు కాదు. చదువుకోనిచ్చే వారు కూడా కాదు. కానీ ఇప్పుడు కాలం మారింది.

ప్రతి ఒక్కరి ఆలోచన కూడా మారింది. పురుషులతో సమానంగా స్త్రీలకు కూడా ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి. చదువులో కూడా ఆడవాళ్లు ముందు ఉంటున్నారు. అయితే ఈ మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ఇంట్లో ఉండే ఈతరం కోడళ్ళు ఇంటి పనులకు చాలా దూరంగా ఉంటున్నారు. అసలు ఇంటి పనులు చేయడానికి ఇష్టపడటం లేదు.

కేవలం ఉద్యోగం మరియు వాళ్ళ పనులు చేసుకుంటున్నారు. కానీ ఇంటి పనులు జోలికి పోవడం లేదు. ఎందుకు ఇంటి పనులు జోలికి వెళ్లడం లేదు అన్న ప్రశ్నకి ఓ కోరా యూజర్ ఇలా ఒక సమాధానం చెప్పింది. దానిని చూశారంటే షాక్ అవుతారు. ఆడవాళ్ళు మాత్రమే ఇంటి పనులు చేయాలని అలసిపోయినా సరే ఆడవాళ్ళు ఖచ్చితంగా ఇంటి పనులు చేసుకోవాలి అని అంటూ ఉంటారు.

అదే ఒకవేళ మగవాళ్ళు లేదా అబ్బాయిలు ఇంటి పనులు నేర్చుకున్నా, వాళ్ళకి వచ్చినా, ఖాళీగా వున్నా కూడా వాళ్ళని ఎప్పుడూ చేయమని చెప్పరు. వాళ్ళు అబ్బాయిల కనుక చెయ్యక్కర్లేదు అంటారు. అమ్మాయిలు కుకింగ్ నేర్చుకోకూడదు.. పనులు చేయకూడదు అని నేను చెప్పట్లేదు.. కానీ, అది అమ్మాయిలు మాత్రమే నేర్చుకుని చేయాల్సిన అవసరం లేదు. అది బతకడం కోసం అవసరమైన విద్య. అందరు నేర్చుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈ ప్రశ్నలో కూడా.. కోడళ్ళు ఎందుకు పనులు చెయ్యట్లేదు..? అని మాత్రమే ఉంది.. ఇదే ప్రశ్న వారు వారి కొడుకులని అడుగుతారా..? అడుగగలరా..?

daughter in law

ఎట్టి పరిస్థితుల్లోనూ అడగరు. ఎందుకంటే వారు అబ్బాయిలు కదా అని అనేస్తూ ఉంటారు. దీనినే పక్షపాతం అని అంటారు. ఇబ్బందికర పరిస్థితులు అమ్మాయిలకు కూడా వస్తుంటాయి. వాటిని అర్ధం చేసుకునే విధంగా కొడుకులని పెంచాలి. కానీ అమ్మాయి అలసిపోయినా, ఏదైనా సమస్య ఉన్నా ఖచ్చితంగా పనులు చేసుకోవాల్సిందే. ఆమె అలసిపోయినప్పటికి కూడా ఎవరూ పట్టించుకోరు అని ఒక ఆమె బదులిచ్చింది.


You may also like

Leave a Comment