AADIKESAVA IN OTT: ఓటిటి లోకి వచ్చేస్తున్న ఆది కేశవ…. స్ట్రీమింగ్ ఎప్పుడంటే…?

AADIKESAVA IN OTT: ఓటిటి లోకి వచ్చేస్తున్న ఆది కేశవ…. స్ట్రీమింగ్ ఎప్పుడంటే…?

by Harika

Ads

మెగా హీరో వైష్ణవ్ తేజ్ హీరోగా క్రేజీ హీరోయిన్ శ్రీ లీల జంటగా వచ్చిన చిత్రం ఆదికేశవ. ఈ చిత్రం ధియేటర్లలో ఫ్లాప్ అయింది. మంచి ఎక్స్పెక్టేషన్స్ నడుమ విడుదలైన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు తిరస్కరించారు.రొటీన్ చిత్రంగా మిగిలిపోవడంతో నిర్మాతలకు నష్టాలు తప్పలేదు. పైగా ఈ చిత్రాన్ని త్రివిక్రమ్ భాగస్వామిగా ఉన్న సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నిర్మించడం విశేషం. ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. వైష్ణవ తేజ్ ను మాస్ హీరోగా చూపిస్తూ ఈ చిత్రాన్ని తరికెక్కించిన ఆయనకు ఇది చేదు ఫలితాన్ని అందించింది.

Video Advertisement

aadikeshava movie review

అయితే ఈ చిత్రం త్వరలో ఓటిటిలోకి రానుంది.థియేటర్ లో ప్లాప్ అయిన చిత్రం వెంటనే ఓటిటి లోకి వచ్చేయడం ఆనవాయితీ. ఇప్పుడు అదే ఆనవాయితీని ఆదికేశవ చిత్రం కూడా పాటిస్తుంది.ఈ చిత్ర ఓటిటి స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసింది.

ఈ చిత్రాన్ని క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 22 తారీకు నుండి స్ట్రీమింగ్ చేయనున్నట్లుగా ప్రకటించింది. థియేటర్ లో ప్లాప్ అయినా ఈ చిత్రం ఓటిటిలో అయిన ఆకట్టుకుంటుందేమో వేచి చూడాలి. చాలా చిత్రాలు థియేటర్లలో ప్లాప్ అయినా కూడా ఓటిటి లో సూపర్ హిట్ గా నిలుస్తున్నాయి. మంచి స్ట్రీమింగ్ వ్యుస్ తో దూసుకుపోతున్నాయి. అందుకు ఉదాహరణ తాజాగా వచ్చిన స్కంద మూవీ నే.


End of Article

You may also like