స్టార్ హీరోలు అందరి సరసన నటించిన టాప్ హీరోయిన్…కానీ చివరి రోజుల్లో అలాంటి నరకం చూసి.?

స్టార్ హీరోలు అందరి సరసన నటించిన టాప్ హీరోయిన్…కానీ చివరి రోజుల్లో అలాంటి నరకం చూసి.?

by Mohana Priya

Ads

మొదటి సినిమాతో హిట్ సాధించి, మొదటి సినిమాతోనే స్టార్ డమ్ సంపాదించుకున్న నటులు చాలా తక్కువ మంది ఉంటారు. వారిలో ఒకరు ఆర్తి అగర్వాల్. ఆర్తి అగర్వాల్, విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన నువ్వు నాకు నచ్చావ్ సినిమాతో హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఈ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో మనందరికీ తెలుసు.

Video Advertisement

Aarthi Agarwal story

సినిమా సూపర్ హిట్ అవ్వడంతో పాటు ఆర్తి అగర్వాల్ కి కూడా స్టార్ డమ్ తీసుకొచ్చింది. నువ్వు నాకు నచ్చావ్ ఆర్తి అగర్వాల్ మొదటి తెలుగు సినిమా. అంతకు ముందే పాగల్ పన్ అనే హిందీ సినిమాలో నటించారు. నువ్వు నాకు నచ్చావ్ తర్వాత నువ్వు లేక నేను లేను, అల్లరి రాముడు, ఇంద్ర, నీ స్నేహం, బాబి, పలనాటి బ్రహ్మనాయుడు, ఇలా వరుస సినిమాలతో దూసుకెళ్లారు ఆర్తి అగర్వాల్.

Aarthi Agarwal story

ఆ సమయంలో ఉన్న దాదాపు అందరు స్టార్ హీరోల సరసన నటించారు. తర్వాత 2005 లో ఆర్తి అగర్వాల్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. దెబ్బలు తగలడంతో ఆర్తి అగర్వాల్ ఆస్పత్రిలో చికిత్స పొందారు. తెలుగు ఫిల్మీ బీట్ కథనం ప్రకారం ఆర్తి అగర్వాల్ ఇలా చేయడానికి ఒక యువ హీరోతో ప్రేమలో ఉండడం, ఆ ప్రేమ విఫలం అవ్వడమే కారణం అనే వార్తలు వచ్చాయి.

Aarthi Agarwal story

ఆ తర్వాత నటిగా మళ్లీ తన కెరీర్ ని కొనసాగించారు ఆర్తి అగర్వాల్. 2006లో సునీల్ సరసన అందాల రాముడు సినిమాలో నటించారు. ఆ తర్వాత గోరింటాకు, దీపావళి, పోసాని జెంటిల్మెన్, బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం, వనకన్య వండర్ వీరుడు సినిమాలో నటించారు. 2007 లో ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ తో ఆర్తి అగర్వాల్ వివాహం జరిగింది. వారిద్దరూ 2009 లో విడిపోయారు.

 

2015లో ఆర్తి అగర్వాల్ లైపోసెక్షన్ సర్జరీ చేయించుకున్నారు. 2015 జూన్ 6వ తేదీన ఆర్తి అగర్వాల్ ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. చనిపోయేముందు ఆర్తి అగర్వాల్ ఊపిరి సంబంధిత సమస్యలతో బాధ పడ్డారట. ఆర్తి అగర్వాల్ మరణానికి కారణం గుండెపోటు అని ఆర్తి అగర్వాల్ మేనేజర్ తెలిపారు. ఆర్తి అగర్వాల్ తల్లిదండ్రులపై ఎలాగ డాక్టర్స్ పై కూడా అప్పుడు కేసు నమోదు అయ్యిందట. ఆర్తి అగర్వాల్ మరణంతో సినీ ఇండస్ట్రీ మొత్తం షాక్ కి గురయింది. ఆర్తి అగర్వాల్ చివరిగా ఆమె ఎవరు అనే సినిమాలో కనిపించారు.


End of Article

You may also like