సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ గత సంవత్సరం రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఆ ప్రమాదంలో  ఆయనకు తీవ్రంగా గాయాలయ్యాయి. కొన్ని రోజులు కోమాలోకి వెళ్ళిన సాయి ధరమ్ తేజ్ ఆ తర్వాత మెల్లగా కొలుకున్నాడు.

Video Advertisement

రోడ్డు యాక్సిడెంట్ జరిగినపుడు ఆయనని వెంటనే హాస్పటల్ కి తీసుకెళ్లేలా చేసిన వ్యక్తి పేరు అబ్దుల్‌ ఫర్హాన్‌. సకాలంలో తేజ్‌కు ట్రీట్మెంట్ అందేట్టు చేసిన అబ్దుల్‌కు తేజ్‌ ఫోన్‌ నెంబర్‌ ఇచ్చి, ఎప్పుడు ఎలాంటి అవసరం వచ్చినా కాల్‌ చేయమని చెప్పానని తెలిపారు. అయితే ఇవేవీ నిజం కాదని అబ్దుల్ చెప్తున్నాడు.
తేజ్ కి యాక్సిడెంట్ జరిగినపుడు అక్కడే ఉన్న అబ్దుల్ ఫర్హాన్ అనే వ్యక్తి అంబులెన్స్ కు కాల్ చేశారు. కిందపడిన తేజ్ ను లేపి, నీళ్లు తాగించాడు. అయితే ఆ సమయంలో అతనికి ప్రమాదం జరిగింది సాయి ధరమ్ తేజ్ కు అని తెలియదంట. మానవత్వంతోనే సాయి ధరమ్ తేజ్ ను కాపాడాడు. అయితే తేజ్ కోలుకున్న తర్వాత అబ్దుల్ ను తేజ్ కలిశాడని, అలాగే అతనికి ఏ సాయం కావాలన్నా అడగమని తన ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారని అప్పట్లో బాగా ప్రచారం జరిగింది.
అంతే కాక మెగా కుటుంబం లక్షల రూపాయలు, కారు, బంగ్లా వంటివి బహుమతిగా ఇచ్చారని కూడా ఎన్నో ప్రచారాలు  జరిగాయి. అయితే ఇటీవల తేజ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అవన్నీ నిజం కాదని, ఎలాంటి రివార్డు కూడా అబ్దుల్ కి ఇవ్వలేదని స్వయంగా చెప్పాడు. అయితే ఫోన్‌ నెంబర్‌ అబ్దుల్ కి ఇచ్చానని, ఎప్పుడు ఎలాంటి అవసరం  వచ్చినా తనకు కాల్‌ చేయమన్నానని తెలిపాడు.ఇదే విషయాన్ని అబ్దుల్‌ ఫర్హాన్‌ అడుగగా సాయి ధరమ్ తేజ్ కానీ, మెగా కుటుంబం కానీ తనకు ఎటువంటి సాయం చేయలేదని అబ్దుల్ అన్నారు. తేజ్ తనను కలవలేదని, ఫోన్ నంబర్ ఇవ్వలేదని, ఈ ఫేక్ ప్రచారాలు వల్ల తాను చాలా ఇబ్బంది పడుతున్నట్టు చెప్పాడు. చేసే ఉద్యోగం కూడా వదిలేశానని అన్నాడు.
అప్పట్లో ఒక షాప్ లో వర్క్ చేసేవాడిని,  తేజ్ ను కాపాడినందుకు మెగా కుటుంబం డబ్బులు, కారు, బిల్డింగ్ ఇచ్చినట్టు రూమర్స్ రావడంతో షాప్ కు వచ్చిన వారందరూ బాగా డబ్బు ఇచ్చారంట కదా అని బాగా వేధించారని అది తట్టుకోలేక ఆఖరికి ఉద్యోగం మానేశాను. 4 నెలల నుండి ఏ జాబ్ లేక ఖాళీగా ఉన్నానని చెప్పుకొచ్చాడు.

Also Read: RC 16 కథగా రూపొందుతున్న ఈ “కోడి రామ్మూర్తి నాయుడు” గొప్పతనం ఏంటి..? అసలు ఆయన ఎవరు..?