బిగ్ బాస్ తెలుగు సీజన్ ఫోర్ విజేత, అభిజిత్ ఇటీవల ఒక ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో ఎలాంటి ఆలోచనలతో బిగ్ బాస్ లో అడుగు పెట్టారు అని అడగగా, అందుకు అభిజిత్ ఇలా సమాధానమిచ్చారు. “నేను చాలా ఓపెన్ మైండ్ తో బిగ్ బాస్ కి వెళ్ళాను. బిగ్ బాస్ వాళ్లు గత మూడు నాలుగు సంవత్సరాలుగా నాతో మాట్లాడుతున్నారు. కానీ ఈసారి కుదిరింది. ఇది నేను కేవలం ఒక ఎక్స్పీరియన్స్ లాగా మాత్రమే అనుకొని వెళ్ళాను” అని అన్నారు.

అలాగే బిగ్ బాస్ లోకి వెళితే “ప్రేక్షకులకి ఇంకా ఎక్కువగా తెలిసే అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో వెళ్లారా?” అని అడగగా అందుకు అభిజిత్  “ఖచ్చితంగా అది ఒక రీజన్. బిగ్ బాస్ అనేది చాలా మంచి ప్లాట్ ఫామ్. ఆ టైంలో లాక్ డౌన్ కారణంగా సినిమా ఇండస్ట్రీలో వర్క్ జరగట్లేదు. అంతే కాకుండా నాకు 2019 లో ఫుట్ బాల్ ఆడుతున్నప్పుడు గాయం అయ్యింది.

లిగమెంట్ టేర్ అయ్యింది. ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ జరిగింది. సెప్టెంబర్ నుంచి జనవరి వరకు ఐదు నెలల పాటు పూర్తిగా బెడ్ రెస్ట్ లో ఉన్నాను. ఫిబ్రవరిలో మళ్లీ బయటికి వచ్చాను. మార్చిలో మళ్ళీ లాక్ డౌన్ మొదలైంది. ఇంట్లో ఉండి విసుగొచ్చింది. నేను మళ్ళీ పని చేయాలి అనుకున్నాను.

Bigg Boss Telugu 4 Abhijeet

Bigg Boss Telugu 4 Abhijeet

నేను బిగ్ బాస్ ని ఒక ఛాలెంజ్ గా తీసుకున్నాను. ఇలా ఇంట్లో ఉండటం కంటే బిగ్ బాస్ కి వెళ్ళడం కరెక్ట్ అనిపించింది. వెళ్లేటప్పుడు ఇది నా ప్రొఫెషన్, నేను వర్క్ చేయడానికి మాత్రమే వచ్చాను అనే ఆలోచన మైండ్ లో పెట్టుకున్నాను. నేను 105 రోజులు కేవలం వర్క్ చేశాను. ఇది నా అప్రోచ్” అని అన్నారు అభిజిత్.

Watch video :